TVK: లీకైన విజయ్ వ్యూహం! 40 శాతం ఓట్లతో సీఎం పీఠం?

తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. 2026లో కోటపై ఎగిరే జెండా ఎవరిది? అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే వంటి దిగ్గజ పార్టీల మధ్య 'తమిళగ వెట్రి కజగం' (TVK) అడుగులు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. జస్ట్ పార్టీ పెట్టడమే కాదు, ఏకంగా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు దళపతి విజయ్ టీమ్ ఒక పక్కా 'రోడ్ మ్యాప్' సిద్ధం చేసింది. కేవలం 40% ఓట్లను సాధిస్తే చాలు.. తమిళనాడు పీఠం దక్కుతుందని టీవీకే అగ్రనాయకత్వం ధీమాగా ఉంది. అసలేంటి ఆ లెక్క? విజయ్ నమ్ముకున్న ఆ 40% ఓటర్లు ఎవరు?

టీవీకే అగ్రనాయకత్వం నమ్ముతున్న లెక్కల ప్రకారం.. తమిళనాడు ఓటర్లలో 40 ఏళ్లలోపు ఉన్న యువత సుమారు 40% ఉన్నారు. వీరిలో 60% మంది యువత ఓట్లను రాబట్టగలిగితే, అది మొత్తం ఓటర్లలో 24 శాతానికి సమానం అవుతుంది. సినిమా క్రేజ్, విజయ్ పట్ల యువతలో ఉన్న క్రేజ్ తమకు ఈ 24% ఓట్లను సులువుగా తెచ్చిపెడుతుందని పార్టీ అంతర్గత విశ్లేషణలో తేలింది. ఈ యంగ్ ఓటర్లే విజయ్ గెలుపు గుర్రం కాబోతున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Thalapathy Vijay TVK 2026 Strategy Target 40 Vote Share to Conquer Tamil Nadu Assembly Elections

మహిళలు, కూలీలే తదుపరి టార్గెట్..

కేవలం యువత మాత్రమే కాదు, ఇతర వర్గాలను కూడా ఆకర్షించేలా విజయ్ వ్యూహాలు ఉన్నాయి.

  • మహిళా ఓటర్లు: 40 ఏళ్లు పైబడిన మహిళా ఓటర్లలో కనీసం 8% మంది మద్దతును కూడగట్టడం.
  • బ్లూకాలర్ కార్మికులు: దైనందిన కూలీలు, బ్లూ కాలర్ ఉద్యోగులైన పురుషుల్లో మరో 8% ఓట్లను రాబట్టడం.

ఈ విధంగా 24% (యువత) + 8% (మహిళలు) + 8% (కార్మికులు) కలిపి మొత్తం 40% ఓట్ల మార్కును చేరుకోవడమే టీవీకే లక్ష్యం. ఈ మేజిక్ ఫిగర్ గనుక సాధిస్తే, తమిళనాడులో కనీసం 120 స్థానాల్లో విజయం సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని లేదా కనీసం హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్‌గా మారొచ్చని ఆ పార్టీ నాయకత్వం బలంగా నమ్ముతోంది.

2026 పోరు.. అంచనాలు భారీ!

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాకర్ రమేష్ బాలా వెల్లడించిన ఈ గణాంకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, విజయ్ పార్టీ క్షేత్రస్థాయిలో ఈ వర్గాలను ఎంతవరకు ప్రభావితం చేయగలదన్నదే ఇప్పుడు కీలకం. ఒకవైపు నియోజకవర్గాల్లో పర్యటనలు, మరోవైపు పక్కాగా వేసుకున్న ఈ ఓటు బ్యాంక్ లెక్కలు చూస్తుంటే, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట పెను మార్పులు సంభవించేలా కనిపిస్తున్నాయి. దళపతి విజయ్ వేసిన ఈ '40% ఫార్ములా' వర్కౌట్ అయితే తమిళనాడు రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైనట్టే!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+