‘థ్యాంక్యూ బడ్డీ’: చనిపోయే ముందు పోలీసుతో కలాం
షిల్లాంగ్: మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాం తుదిశ్వాస విడవడానికి కొన్ని నిమిషాల ముందు ఓ పోలీసుకు కృతజ్ఞతలు తెలిపారు. కలాం సహాయకుడు శ్రీజన్ పాల్ సింగ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సోమవారం షిల్లాంగ్ వెళ్లిన కలాం అక్కడ నుంచి తాను సెమినార్‌లో పాల్గొనాల్సిన ఐఐఎంకు రోడ్డు మార్గాన వెళ్లారు.

కలాం కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న ఓపెన్ జిప్సీలో ఓ పోలీస్ నిలుచునే ఉన్నాడు. రెండున్నర గంటలసేపు ప్రయాణం సాగింది. జిప్సీలో పోలీస్‌ను గమనించిన కలాం.. 'అతను ఎందుకు నిలుచున్నాడు. అలిసిపోయినట్టున్నాడు. అతనికిది శిక్ష లాంటిది. ఆ పోలీసును కూర్చోమని వైర్ లెస్ మెసేజ్ పంపమని చెబుతావా' అని తనతో చెప్పినట్టు శ్రీజన్ వెల్లడించారు.
Hre is jawan drkalam insistd2meet&thnk as he ws standin fr2.5hr in pilot vhicle.dis ws hs lst meetin@srijanpalsingh pic.twitter.com/wNnVD0CI4W
— In memoryof Dr.Kalam (@APJAbdulKalam) July 28, 2015 ఐఐఎం భవనం వద్దకు చేరుకోగానే శ్రీజన్ ఆ పోలీసును కలాం దగ్గరకు తీసుకువెళ్లారు. కలాం.. పోలీస్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. 'థ్యాంక్ యూ బడ్జీ. అలసిపోయావా? ఏమైనా తింటావా? నాకోసం చాలా దూరం నిలుచుని వచ్చావు.. క్షమించు' అని కలాం గార్డుతో అన్నారు.
కాగా, ఐఐఎం భవనంలోకి వెళ్లిన కలాం కొన్ని నిమిషాల తర్వాత ప్రసంగిస్తూనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాగా, కలాం అంత్యక్రియలు జులై 30న ఆయన స్వగ్రామం రామేశ్వరంలో జరగనున్నాయి.












Click it and Unblock the Notifications