బీజేపీ కోసం బ్యాక్ గ్రౌండ్ లో బాగానే హార్డ్ వర్క్ చేసినట్టున్నాడు- దగ్గరుండి గెలిపించాడు?!
కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ హవా కొనసాగుతోంది. అనేక చోట్ల ఏకపక్షంగా విజయం సాధిస్తోంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్ లల్లో యూడీఎఫ్ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తోన్నారు. వామపక్షాల నాయకత్వంలోని అధికార ఎల్డీఎఫ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ ఒకట్రెండు చోట్ల ఖాతా తెరిచింది.
కేరళలో ఉన్న మొత్తం 86 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు, 14 జిల్లా పరిషత్ స్థానాలకు ఇటీవలే పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. వాటి లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ఆరంభమైంది. ప్రారంభం నుంచే యూడీఎఫ్ ప్రభంజనం కనిపించింది. యూడీఎఫ్ మొత్తం 54 మున్సిపాలిటీలను గెలుచుకుంది. 28 చోట్ల అధికార ఎల్డీఎఫ్ విజయం సాధించింది.

పంచాయతీల్లో కూడా యూడీఎఫ్ దే హవా కనిపించింది. మొత్తం 504 పంచాయతీలను గెలుచుకుంది. ఎల్డీఎఫ్- 342, బీజేపీ- 63 చోట్ల విజయం సాధించింది. మున్సిపల్ కార్పొరేషన్లల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొల్లం, కోచి, త్రిశూర్, కన్నూర్ లల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కోజికోడ్ ను తన ఖాతాలో వేసుకుంది ఎల్డీఎఫ్. ప్రతిష్ఠాత్మక తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ను భారతీయ జనతా పార్టీ గెలుచుకోగలిగింది. ఇక్కడ ఆ పార్టీ గెలవడం ఇదే తొలిసారి. ఎన్డీఏ- 50, ఎల్డీఎఫ్- 29, యూడీఎఫ్- 19 వార్డుల్లో జెండా పాతాయి. ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. అభ్యర్థి మరణించిన కారణంగా ఒక వార్డులో పోలింగ్ రద్దయింది.
తిరువనంతపురం.. కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు శశిథరూర్ కు పెట్టనికోట. 2009 నుంచీ ఆయనే ఇక్కడ గెలుస్తూ వస్తోన్నారు. నాలుగుసార్లు ఇక్కడి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈ లోక్ సభ నియోజకవర్గంలో ఈ రికార్డు మరెవరికీ లేదు. అలాంటిది- ఇప్పుడు ఆయన కోటకు తూట్లు పొడిచింది బీజేపీ. మొత్తం 50 వార్డులను గెలుచుకోవడం అంటే అసాధారణం. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కు కలిపి కూడా అన్ని వార్డులు దక్కలేదు.
తిరువనంతపురం కార్పొరేషన్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. 45 సంవత్సరాల ఎల్డీఎఫ్ ఆధిపత్యానికీ తెరదించింది. ఒక దెబ్కు రెండు పిట్టలన్నట్టు నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్, కార్పొరేషన్ లో ఎల్డీఎఫ్ ను మట్టకరిపించగలిగింది. తిరువనంతపురంతో పాటు ఎర్నాకుళం జిల్లాలోని త్రిపునిథుర మునిసిపాలిటీని కూడా గెలుచుకుంది బీజేపీ. ఇక్కడా అధికార ఎల్డీఎఫ్‌ను గద్దె దింపింది. ఈ దెబ్బతో శశిథరూర్ కు బీజేపీ పార్టీలోకి రెడ్ కార్పెట్ పరచడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ఈ విజయం పట్ల ప్రధాని మోదీ స్పందించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. కేరళ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపుగా అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలను తమ పార్టీ మాత్రమే నెరవేర్చగలదని ప్రజలు విశ్వసిస్తున్నారని ఈ తీర్పు స్పష్టం చేసిందని అన్నారు. నగర పురోగతికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి కృషి చేస్తామని ప్రధాని మోదీ అన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications