అది మహిళా శక్తి: మేరీ కోమ్ స్వర్ణంపై ప్రియాంక చోప్రా
ముంబై: ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో మేరీ కోమ్ స్వర్ణ పతకం సాధించడంపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రతిస్పందించారు. సినిమాలో ప్రియాంక చోప్రా మేరీ కోమ్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. మేరీ కోమ్ స్వర్ణపతకం సాధించడం మహిళా శక్తికి సంకేతమని ప్రియాంక అన్నారు.
మేరీ కోమ్‌ను ప్రియాంక చోప్రా తన ట్విట్టర్ వ్యాఖ్యల ద్వారా అభినందించారు. మేరీ కోమ్ స్వర్ణం సాధించారని, భారత గౌరవాన్ని నిలబెట్టారని, మనం ఏదైనా సాధించగలమని నిరూపించారని ఆమె అభినందించారు. మేరీ కోమ్ స్వర్ణం సాధించినట్లు వార్తలు వెలువడిన వెంటనే బుధవారం ప్రియాంక చోప్రా ట్విట్టర్‌లో అభినందించారు.

ప్రియాంక, మేరీ కోమ్ మంచి మిత్రులయ్యారు. ఫైనల్‌కు ముందు కూడా ప్రియాంక చోప్రా మేరీ కోమ్‌ను అభినందించారు. ఫైనల్ ఫలితం ఎలా ఉన్నా మేరీ కోమ్ సాధించినదానికి భారత్ గర్వపడుతుందని అన్నారు. మేరీ కోమ్ నిజమైన చాంపియన్ అని మంగళవారంనాడు ట్విట్టర్‌లో అన్నారు.
ముగ్గురు పిల్లల తల్లి అయిన మేరీ కోమ్ మణిపూర్‌కు చెందిన క్రీడాకారిణి. ఆమె అన్ని రకాల ఆటంకాలను అధిగమించి బాక్సింగ్‌లో మెట్లు ఎక్కుతూ వెళ్లారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications