బాలిక రేప్, హత్య: కామాంధుడికి యావజ్జీవ శిక్ష
బాగల్ కోటే (కర్ణాటక): బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన కామాంధుడికి న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. శిక్షతో పాటు రూ. 30 వేల అపరాధ రుసుం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
జమఖండి సమీపంలోని అసంగి గ్రామంలో నివాసం ఉంటున్న యమనప్ప మాంగ (40) అనే కామాంధుడికి శుక్రవారం జమఖండి పట్టణ ఒకటవ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జీ.ఎం. శీనప్ప శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

అపరాధ రుసుం చెల్లించుకుంటే అదనంగా 18 నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. 2012వ సంవత్సరంలో డెంపుడేరి సమీపంలో 12 సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేసిన యమనప్ప నిర్జన ప్రదేశంలోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు.
తరువాత బాలిక విషయం బయటకు చెబుతుందని భయపడి అతి దారుణంగా హత్య చేశాడు. తన కుమార్తె కనపడటం లేదని బాలిక తండ్రి కుమార మాంగ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కామాంధుడు యమనప్పను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications