బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రోఫెసర్ భగవాన్ మీద వీహెచ్‌పీ యుద్దం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: హిందూ ధర్మాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రోఫెసర్ భగవాన్ కు విరుద్దంగా వీహెచ్ పీ 100 ఫిర్యాదులు చేస్తున్నది. ఇప్పటికే భగవాన్ మీద క్రిమినల్ కేసు నమోదు కావడంతో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) సైతం కేసులు పెట్టడానికి సిద్దం అయ్యింది.

రామాయణంలో రాముడు దశరథుడికి పుట్టలేదని, మహాభారతం చదివే వాళ్లు ఉగ్రవాదులని, భగవద్గీతకు నిప్పంటించాలని తదితర హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా అనుచుతి వ్యాఖ్యలు చెయ్యడంతో హిందువుల ఆగ్రహానికి గురైనారు.

మైసూరు యూనివర్శిటిలో ఇంగ్లీష్ విభాగం చీఫ్ ప్రోఫెసర్ గా పని చేసి రిటైర్డ్ అయిన భగవాన్ మీద పలు హిందూ సంఘాలు, సంస్థలు మండిపడుతున్నాయి. భగవాన్ కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తామని వీహెచ్ పీ లీగల్ సెల్ అధ్యక్షుడు జగదీష్ శేనావా అంటున్నారు.

The Bengaluru police will question K S Bhagwan following a complaint

ఇప్పటికే కర్ణాటకలోని ఉడిపి జిల్లా ఉప్పినంగడిలో భగవాన్ మీద క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసు బెంగళూరు లోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ కు బదిలి అయ్యిందని బెంగళూరు సెంట్రల్ విభాగం డీసీపీ సందీప్ పాటిల్ చెప్పారు. సెక్షన్ 295 (ఏ) కింద భగవాన్ మీద కేసులు నమోదు అయ్యాయి.

ఏ ధర్మాన్నిఅయినా సరే వ్యక్తి గతంగా కించపరచడం చట్టపరంగా నేరమని, అలా చేసిన వారిమీద 295 (ఏ) సెక్షన్ పై కేసులు నమోదు చేస్తారని న్యాయనిపుణులు అంటున్నారు. ఇటీవల నిన్ను చంపేస్తాం అంటూ గుర్తు తెలియని వ్యక్తులు భగవాన్ కు ఉత్తరం వ్రాసి బెదిరించిన విషయం తెలిసిందే.

English summary
The Bengaluru police will question K S Bhagwan following a complaint that was lodged against him even as the Vishwa Hindu Parishad (VHP) plans on filing 100 more complaints.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X