గాలి కుమార్తె శుభలేఖ ఖరీదు ఎంతంటే !
బెంగళూరు/బళ్లారి: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహ శుభలేఖ ఖరీదు ఎంత ? అని అందరూ ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. శుభలేఖ ఖరీదు గురించి ఎవరికి తోచినట్లు వారు ఊహించుకుంటున్న సమయంలో ఆ శుభలేఖ ఖరీదు ఎంత అనే విషయం వెలుగు చూసింది.
హైదరాబాద్ కు చెందిన రాజీవ్ రెడ్డి (ప్రముఖ పారిశ్రామికవేత్త పాణ్యం విక్రమ్ దేవా రెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడు) తో గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహం నిశ్చయం అయిన విషయం తెలిసిందే.
బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో ఈనెల 16వ తేదీన పెళ్లి ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బళ్లారీలోని హవంబావిలోని గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో ఇప్పటికే పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి.

ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి పెళ్లి జరిపించారని నానుడి వింటుంటాం. అయితే గాలి జనార్దన్ రెడ్డి తన స్థోమతకు తగ్గట్టుగా తన కుమార్తె వివాహం జరిపించాలని నిర్ణయించారని ఆయన వర్గీయులు అంటున్నారు.
గాలి జనార్ధన్ రెడి, ఆయన సతీమణి లక్ష్మిఅరుణ, వీరి కుమారుడు కిరీటి రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి విజయ, వీరి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు శుభకార్యాల పనులు చకచకా చేస్తున్నారు. అయితే ఇప్పటికీ అంతు చిక్కని విషయం ఒకటి ఉందని ప్రజలు గుసగుసలాడుతున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహ శుభలేఖలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు భారతదేశంలో ఎవ్వరూ ఇలాంటి వెడ్డింగ్ కార్డు తయారు చెయ్యలేదని తెలిసిందే.
బ్రహ్మిణి, రాజీవ్ రెడ్డి వివాహ శుభలేఖను ఓ బాక్స్ లో ఎల్ సీడీ అమర్చి అందులో పెళ్లికి రావాలని గాలి కుటుంబ సభ్యులు పాటపాడుతూ అందరిని ఆహ్వానిస్తూ నవదంపతులను ఆశిర్వధించాలని మనవి చేసిన విషయం తెలిసిందే.
ఈ వెడ్డింగ్ కార్డు బాక్స్ లో ఖరీదైన వినాయకుడి విగ్రహంతో పాటు డ్రై ప్రూట్స్ తదితర సరంజామాను పెట్టి బంధు మిత్రులకు అందించారు. ఈ శుభలేఖ రూ. 7 వేల నుంచి రూ. 8 వేల రూపాయలతో తయారు చేయించారని బళ్లారికి చెందిన గాలి సన్నిహితులు తెలిపారు.












Click it and Unblock the Notifications