నితీశ్ ప్రమాణస్వీకారం: మోడీకి అహ్వానం !

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నితీశ్ కుమార్ పార్టీలకు అతీతంగా అందరిని ఆహ్వానించాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితరులను ఆహ్వానించాలని బీహార్ ప్రభుత్వం భావిస్తుందని తెలిసింది.

ఈనెల 20వ తేది మద్యాహ్నం 2 గంటలకు పాట్నాలో నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు. అందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అట్టహాసంగా ఈ వేడుకలు నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు మొదలైనాయి.

The Bihar government is also expected to invite PM Narendra Modi !

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఆహ్వానించారు. జేడీయూ మిత్రపక్షాలైన ఆర్జీడీ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

అదే విదంగా నితీశ్ కుమార్ స్వయంగా ఫోన్ చేసి పిలవడంతో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరుఖ్ అబ్దుల్లా కార్యక్రమానికి వస్తున్నానని హామి ఇచ్చారు. అయితే బీహార్ లో పరాజయం మూటకట్టుకున్న బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా లేదా అనేది కచ్చితంగా తెలియడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+