Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోదీ హయాంలో మారిన కాశ్మీర్ ముఖచిత్రం..

Jammu Kashmir: భూతల స్వర్గం అనే పేరు వినగానే ఠక్కున గుర్తుకొచ్చేది.. జమ్మూ కాశ్మీర్. ఒకప్పుడు ఉగ్రవాదుల అడ్డాగా మారిన కాశ్మీర్ తీరుతెన్నులను సమూలంగా మార్చివేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం

భూతల స్వర్గం అనే పేరుకు సార్థకతను చేకూర్చింది. దీనికోసం 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం చేసిన కృషి, తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులే దీనికి ప్రధాన కారణం. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత జమ్మూ కాశ్మీర్‌లో చోటు చేసుకున్న మార్పులను దీనికి నిదర్శనం.

The BJP govt led by PM Modi restoring Jammu Kashmir to its glory as the Heaven on Earth

మోదీ సారథ్యంలో కేంద్రం.. జమ్మూ కాశ్మీర్‌లో శాంతిని పునరుద్ధరింపజేసింది. అక్కడే ఆ ప్రాంత అభివృద్ధికి బీజం పడినట్టయింది. ప్రజాస్వామ్య విలువలను కాపాడటాన్ని లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన సంస్కరణలు, అభివృద్ధి ప్రాజెక్టులు.. జమ్మూ కాశ్మీర్‌లో విప్లవాత్మక మార్పులకు కారణం అయ్యాయి.

జమ్మూ కాశ్మీర్‌లో చోటు చేసుకున్న మార్పులు వివిధ కోణాల్లో స్పష్టంగా కనిపిస్తాయనడంలో సందేహాలు అక్కర్లేదు. ప్రతి ఒక్కరినీ కట్టిపడేసే ప్రకృతి సౌందర్యం, కాశ్మీరీయుల సాంస్కృతిక భిన్నత్వం, ఆ ప్రాంతానికి ఉన్న చరిత్ర.. ఆ ప్రాంతం సొంతం. దశాబ్దాల పాటు కొనసాగిన ఉగ్రవాద కార్యకలాపాలు, మిలిటెన్సీ.. అక్కడి అస్థిరతకు కారణం అయ్యాయి. ఫలితంగా అభివృద్ధి స్తంభించింది.

మళ్లీ కాశ్మీర్‌ అభివృద్ధిని పట్టాలెక్కించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చింది. ఇందులో భాగంగా- మౌలిక సదుపాయాలను కల్పించడం, కనెక్టివిటీని పెంచడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. ఫలితంగా- జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది.

The BJP govt led by PM Modi restoring Jammu Kashmir to its glory as the Heaven on Earth

కొత్తగా రహదారులను నిర్మించడం, విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకుని రావడం, రైలు మార్గాలను అభివృద్ధి చేయడం వల్ల పర్యాటకుల తాకిడి పెరిగింది ఈ భూతల స్వర్గంలో. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతగానో దోహదం చేస్తోంది. వేలాది మందికి జీవనోపాధిని కల్పిస్తోంది.

జమ్మూ కాశ్మీర్ పట్ల ప్రధాని మోదీ అనుసరిస్తోన్న విధానం ఆ ప్రాంత అభివృద్ధికి మూలస్తంభంగా మారింది. అభివృద్ధి, శాంతి.. ఈ రెండింటినీ అజెండాగా తీసుకున్నారు మోదీ. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దుతో ఈ ప్రాంత అభివృద్ధికి చారిత్రాత్మకమైన మలుపు తిరిగినట్టయింది.

The BJP govt led by PM Modi restoring Jammu Kashmir to its glory as the Heaven on Earth

ఆర్టికల్ 370 రద్దు- భారత్‌లో ఈ ప్రాంతాన్ని పూర్తిగా విలీనం చేసింది. పెట్టుబడులు పెట్టడానికి, ఆర్థిక వృద్ధికి గల అవకాశాలకు బాటలు వేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని ప్రతి మారుమూల ప్రాంతంలో ఇప్పుడు త్రివర్ణ పతాకం ఎగురుతోండటం దేశ సమైక్యత, సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది.

ప్రధాని మోదీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్ నివాసితుల జీవన నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించింది. విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ, పారిశ్రామిక జోన్ల ఏర్పాటు వంటివి ఉన్నాయి. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనపై దృష్టి సారించడం వల్ల యువతకు మెరుగైన ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయి.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత జమ్మూ కాశ్మీర్‌లో అత్యంత ముఖ్యమైన మార్పులలో ఒకటి శాంతిభద్రతలను గణనీయంగా మెరుగుపరచడం. ఒకప్పుడు మిలిటెన్సీ, టెర్రరిస్టు దాడులతో అల్లాడుతున్న ఈ ప్రాంతంలో హింసాత్మక పరిస్థితులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. సాయుధ బలగాలకు కేంద్రం పూర్తిస్వేచ్ఛను ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైంది.

The BJP govt led by PM Modi restoring Jammu Kashmir to its glory as the Heaven on Earth

భద్రతా బలగాలు, గూఢచార కార్యకలాపాలు పెరగడం వల్ల తీవ్రవాదులు వేర్పాటువాదుల ఆందోళనలు భారీగా తగ్గాయి. వాటి నెట్‌వర్క్‌ పూర్తిగా స్తంభించిపోయింది. దీనివల్ల స్థిరమైన, సురక్షితమైన వాతావరణం ఏర్పడింది జమ్మూ కాశ్మీర్‌లో. మెరుగైన భద్రత పరిస్థితులు స్థానికుల జీవితాల్లో వెలుగును నింపాయి.

జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఇరుసుగా భావించే పర్యాటక రంగానికి అదరణ పెరిగింది. పర్యాటకం ఓ ఉప్పెనలా ఎగిసింది. ఆతిథ్య రంగం, ​​రవాణా, హస్తకళలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు అమాంతం పెరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం వల్ల మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను సైతం కాపాడినట్టయింది.

సంవత్సరాల తరబడి రాజకీయ అస్థిరతను చవి చూసిన జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్యంగా భారీ సంఖ్యలో ఓటింగ్ శాతం నమోదు కావడం.. అక్కడి ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న విశ్వాసానికి అద్దం పట్టినట్టయింది. ఈ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం బీజేపీ ప్రభుత్వం సాధించిన ఘన విజయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

గ్రామీణ స్థాయిలో జరిగిన ఈ ఎన్నికల అనంతరం స్థానిక నాయకులకు అధికారాన్ని కల్పించినట్టయింది. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు, ఆయా వర్గాల అభివృద్ధికి దోహదపడేలా, దీర్ఘకాలిక స్థిర ప్రభుత్వం, అధికార వికేంద్రీకరణ జమ్మూ కాశ్మీర్ పురోగమనానికి చాలా కీలకం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+