ఢిల్లీకి రావాలని మాజీ సీఎంకు అమిత్ షా పిలుపు, మోదీ ఫైనల్ చేస్తారా ?, సీఎం ను టార్గెట్ చేస్తే !
బీజేపీ, జేడీఎస్ కూటమి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సర్వం సిద్దం చేసుకుంటున్నాయి. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ జేడీఎస్ కు ఎన్ని ఎంపీ సీట్లు ఇస్తుంది ? అనే విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తు, సీట్ల కేటాయింపుపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఇప్పటికే బిజెపి హైకమాండ్ నేతలతో చర్చలు జరిపారు.
లోక్‌సభ ఎన్నికల కోసం కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తుకు సిద్ధమవుతున్నాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడుబీవై విజయేంద్ర, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఇప్పటికే చర్చలు జరిపారు. పొత్తు తుది దశపై చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిని బీజేపీ హైకమాండ్ నేతలు ఆహ్వానించారు. బీజేపీ హైకమాండ్ పిలుపుతో మాజీ సీఎం కుమారస్వామి ఢిల్లీకి వెళ్లడానికి సిద్దం అయ్యారు.

ఈ సందర్భంగా జేడీఎస్ యూత్ విభాగం అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ కుమారుడు నిఖిల్ కుమారస్వామి మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే జేడీఎస్-బీజేపీ కూటమి అభ్యర్థుల జాబితా ఖరారు చేసే ఆ జాబితా, విడుదలపై చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా బీజేపీ నేతలు తమను పిలిచారని తెలిపారు. బీజేపీ నేతలతో చర్చించిన తర్వాత మొత్తం 28 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను త్వరలో విడుదల చేయనున్నారని నిఖిల్ కుమారస్వామి తెలిపారు.
తాను మండ్య నుంచి పోటీ చేయాలని అక్కడి నాయకులు, కార్యకర్తలు పట్టుబట్టారని, గత ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలోని ఓటర్లు తనకు 5 లక్షలకు పైగా ఓట్లు వేశారని, మళ్లీ పోటీ చేయడంపై తాను జేడీఎస్ హైకమాండ్ తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని నిఖిల్ కుమారస్వామి అన్నారు. బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థుల గెలుపునకు వ్యూహరచన చేసేందుకు పాత మైసూరు ప్రాంత పార్టీ నేతలతో సమావేశం నిర్వహించామని నిఖిల్ కుమారస్వామి అన్నారు.

త్వరలో పాత మైసూరు భాగంలోని అన్ని తాలూకాల్లో పర్యటిస్తానని నిఖిల్ కుమారస్వామి చెప్పారు. ఈ వారంలో బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు చర్చలు ఖరారవుతాయని, మార్చి మొదటి వారంలో బీజేపీ తొలి జాబితా వెలువడే అవకాశం ఉందని బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు చెబుతున్నారు. 28 లోక్ సభ నియోజకవర్గాలకు గానూ 6 నియోజకవర్గాలు కావాలని జేడీఎస్ నేతలు ఇప్పటికే బీజేపీ హైకమాండ్ కు మనవి చేశారు. పాత మైసూర్‌లో తమ పలుకుబడిని పెంచుకునేందుకు మండ్య, హాసన్ తో పాటు బెంగళూరు రూరల్, కోలార్, తుమకూరు లోక్‌సభ నియోజకవర్గాలను తమకు ఇవ్వాలని జేడీఎస్ నేతలు బీజేపీ హైకమాండ్ నను కోరినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications