బీజేపీకి టైమ్ లేదు, ఆపరేషన్ కమలాతో బిజీ, ప్రతిఫక్ష నాయరుడు ఎవరు !

బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోయిన తరువాత ఇప్పుడు ఆ పార్టీ నాయకులు అయోమయంలో పడిపోయారు. ఢిల్లీలో జరిగిన సమావేశం ప్రారంభానికి ముందే కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఎన్నుకుంటామని చెప్పిన బీజేపీ ఇంకా ప్రతిపక్ష నేత పేరును ప్రకటించకపోవడంత కాంగ్రెస్ పార్టీ నాయుకులుల బీజేపీ హైకమాండ్ మీద సెటైర్లు వేస్తున్నారు..

బీఎస్ యడ్యూరప్ప ఢిల్లీ వెళ్లి చర్చలు జరిపి జూలై 4వ తేదీన కర్ణాటకలో బీజేపీ ప్రతిపక్ష నాయకుడి పేరు ఖరారు చేస్తామని చెప్పారు. మరోవైపు కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీని టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష నేతను ఎన్నుకోనందుకు కర్ణాటక కాంగ్రెస్ వరుస ట్వీట్లలో బీజేపీని ఎగతాళి చేసింది.

 BJP

కర్ణాకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి 50 రోజులు కావస్తున్నా బీజేపీ ప్రతిపక్ష నేత పేరును ప్రకటించకపోవడంపై కాంగ్రెస్ పలు ఆరోపణలు చేసింది. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ కూడా బీజేపీని అనుసరించే ప్రయత్నం చేసింది. ప్రతిపక్ష నేతను ఎన్నుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ వరుస ట్వీట్లలో బీజేపీని ఎగతాళి చేసింది.

 BJP

బీజేపీలో ప్రతిపక్ష నాయకుడి స్థానం అమ్మకానికి ఉందా అనే తీవ్రమైనప్రశ్న ను కాంగ్రెస్ పార్టీ తలెత్తింది. బేరసారాల వల్లే ప్రతిపక్ష నాయకుడి పేరు ప్రకటన ఆలస్యం అవుతోందని కర్ణాటక బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. బీజేపీలో ఏ పదవి ఇవ్వాలన్నా డీల్ కచ్చితంగా జరగాలని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

దీనిపై కాంగ్రెస్‌ ట్వీట్‌ చేస్తూ ప్రతిపక్ష నేత పదవిని కూడా అమ్మకానికి పెట్టారా? అని బీజేపీ హైకమాండ్ ను ప్రశ్నించింది. ఇంతకు ముందు కర్ణాటక ముఖ్యమంత్రి పదవి రూ. 2, 500 కోట్లకు అమ్మేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది, ప్రతిపక్ష నేత పదవి ఎంతకు అమ్ముడుపోతోంది? ఆ బేరసారాల కారణంగా ఎంపిక ప్రక్రియ ఆలస్యమవుతోందా? అంటూ కర్ణాటక బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

మరో ట్వీట్‌లో కర్ణాటకలో ప్రతిపక్ష నాయకుడి ఎంపికపై బీజేపీ హైకమాండ్ ఇంత వరకు ఆ పార్టీ నాయకులకు హామీ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్ీ ఆరోపించింది. సభ ప్రారంభం కాకముందే ప్రతిపక్ష నేతను అధిష్టానం ఎంపిక చేస్తుందని హామీ ఇచ్చారు. నాయకుడి ఎంపికపై కూడా మీ హైకమాండ్ హామీ ఇవ్వకపోవడం రాజకీయ చరిత్రలోనే అత్యంత విషాదకరం రోజు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

మొన్నటికి మొన్న ప్రతిపక్ష నేతను ఎంపిక చేస్తామని చెప్పిన కర్ణాటక బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. బీజేపీ మాటపై బీజేపీకే గ్యారెంటీ లేదని, ఆ పార్టీ నేతలకు తమ పార్టీపై విశ్వాసం లేదని, ప్రతిపక్ష నేత ఎంపికలో బీజేపీ హైకమాండ్ శ్రద్ద చూపించడం లేదని, మహారాష్ట్ర రాజకీయాల మీదే బీజేపీ హైకమాండ్ ఆసక్త చూపిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఆపరేషన్ కమలా అంటూ అమిత్ షా మహారాష్ట్రకే పరిమితం అయ్యారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

 BJP

ప్రత్యర్థి పార్టీ అధినేత ఎంపిక బీజేపీకి సమస్యగా మారిన మాట వాస్తవమే. బీజేపీ నేతలు సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పను ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపిన బీజేపీ హైకమాండ్ కర్ణాటకలో ప్రతిపక్ష నాయకుడి పేరు ఎంపికపై చర్చించారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించామని, జులై 4వ తేదీన ప్రతిపక్ష నేత పేరు ఖరారవుతుందని బీఎస్. యడియూరప్ప మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+