Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముళ్లును ముళ్లుతోనే తియ్యాలి, కాంగ్రెస్ ను ఫాలో అవుతున్న మోదీ ?, హ్యాట్రిక్ రాజా !

అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లాగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఉచిత హామీల నినాదాలకు తెరలేపింది. ముళ్లును ముళ్లుతోనే తియ్యాలని అనుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత హామీలు అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు అదే ఉచిత హామీలతో దెబ్బ తియ్యాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

కాంగ్రెస్ పార్టీని ప్రధాని మోదీ ఫాలో అవుతున్నారా ?, లేక బీజేపీ లెక్క మార్చిందా ? అనే సందేహం కలుగుతోంది. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఇంతకాలం పలు పథకాలను అమలు చేసినా వాటిని కేంద్ర ప్రభుత్వం ఉచిత పథకాలు అని అంత గట్టిగా ప్రజలకు చెప్పలేదు. అయితే ఇప్పుడు అదే పథకాలను ఉచిత హామీల పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిసింది. ఇంత కాలం ఉచిత హామీలుగా చూపకుండా చేసిన పనులను ఇక ముందు ఉచిత హామీలుగా ప్రచారం చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసిందని తెలిసింది.

The BJP high command is planning to announce free guarantee schemes to the people before the Lok Sabha elections

ఇదంతా లోక్‌సభ ఎన్నికల కోసమేనని తెలుస్తోంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ -2024 ప్రవేశపెట్టింది. బడ్జెట్‌ను సమర్పించిన నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌లో ఇప్పుడు ప్రతినెలా కోటి కుటుంబాలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించారు. ఉచిత కరెంటు ప్రకటించడం ద్వారా లోక్ సభ ఎన్నికల్లో లాభం పొందాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సిద్ధమైంది.

The BJP high command is planning to announce free guarantee schemes to the people before the Lok Sabha elections

దీని ద్వారా లోక్ సభ ఎన్నికల విజయానికి బీజేపీ వ్యూహం రచించించినట్లు అయ్యింది. ఉచిత హామీలు అందిస్తామని ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రకటించిన ఐదు ఉచిత హామీ పథకాలు కీలక పాత్ర పోషించాయి. ఉచిత విద్యుత్ పంపిణీ కూడా ఇందులో ఒకటి. ప్రతి ఇంటికి నిరంతరం విద్యుత్ సరఫరా చెయ్యాలని ప్లాన్ చేస్తోంది. ఇలా కరెంట్ ఉచితంగా ఇస్తే సులువుగా ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చని లెక్కలు వేసే రాజకీయ పార్టీలు ఉన్నాయి.

The BJP high command is planning to announce free guarantee schemes to the people before the Lok Sabha elections

ఉచిత పథకాలను ఈ రాజకీయ పార్టీలు ఎంతకాలం కొనసాగిస్తాయి అనే విషయంలో క్లారిటీలేదని అప్పుడే ప్రజలు ఆరోపిస్తున్నారు. అందుకే వీలైనంత ఎక్కువ మందికి ఉచితంగా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ట్రెండ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల ముందు మొదలైంది. కాంగ్రెస్ దీన్ని మొదలుపెడితే ఇప్పుడు బీజేపీ కూడా ఆ సంస్కృతిని కొనసాగిస్తుందనే ఆసక్తి చూపిస్తోంది. వచ్చే ఐదేళ్లలో రెండు కోట్ల మంది పేదలకు ఉచితంగా ఇళ్ల నిర్మాణం కూడా చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్బంలో తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+