సొంత పార్టీ నాయకులకు షాక్ ఇచ్చిన మోదీ, అమిత్ షా, పక్క పార్టీ లీడర్ కు పదవి ఇచ్చేశారు, అయితే ?
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా ప్రతిపక్ష నేత ఎంపికపై బీజేపీ హైకమాండ్ మాత్రం జాప్యం చేస్తోంది. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, జేడీఎస్‌లు పొత్తు పెట్టుకున్నాయి. అయితే బీజేపీలో ఇంకా ప్రతిపక్ష నేత ఎన్నిక ఎందుకు ఆలస్యమవుతుందనే ప్రశ్న తలెత్తింది.
బీజేపీ-జేడీఎస్ పొత్తులో భాగంగా కూటమిలో నాలుగు లోక్ సభ నియోజకవర్గాలు అడిగిన జేడీఎస్ ఇప్పటికే బీజేపీ హైకమాండ్ నేతలతో చర్చించి. కర్ణాటకలో ప్రతిపక్ష నేత ఎంపికపై కూడా చర్చించినట్లు సమాచారం. విపక్ష నేతలను నియమించడంలో బీజేపీ హైకమాండ్ జాప్యం చేయడంతో చాలా మంది రాష్ట్ర బీజేపీ సీనియర్లను నిరాశకు గురి చేసింది.

అయితే ప్రాంతీయ పార్టీ జేడీఎస్ అధినేత హెచ్ డీ కుమారస్వామికి విపక్ష స్థానం దక్కుతుందనే వార్తలు వినిపిస్తుండడం జేడీఎస్ నేతలకు సంతోషకరమైన విషయమే. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ 65 సీట్లు గెలుపొంది ప్రతిపక్ష పదవి ఎవరికైనా దక్కుతుందా అన్న ప్రశ్న చాలా కాలంగా అందరిని తికమకపెడుతోంది. దాదాపుగా మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్ డీ కుమారస్వామి ప్రతిపక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటారని వెలుగు చూసింది.
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ సమావేశాలు జరిగిన సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు లేకుండానే ఆ సమావేశాలు పూర్తి అయ్యాయి. వచ్చే నెల బెళగావిలో జరిగే శీతాకాల సమావేశాలకు ముందే ప్రతిపక్ష నేతను ఖరారు చెయ్యాలని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల లోపు మరికొంత మంది నేతలు ప్రతిపక్ష నాయకుడి పదవి కోసం పోటీ పడే అవకాశం ఉందని తెలిసింది.
ప్రతిపక్ష నాయకుడి ఎంపికపై బీజేపీ హైకమాండ్ ను ఒప్పించేందుకు ఇప్పటికే అనేక ప్రయత్నాలు జరిగాయి, అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో ప్రతిపక్ష నాయకుడి పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంపై చర్చించేదందుకు బీజేపీ హైకమాండ్ అంత ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిసింది.

లోక్‌సభ ఎన్నికలు పూర్తి అయిన తర్వాతే కర్ణాటక ప్రతిపక్ష నాయకుడి విషయంలో నిర్ణయం తీసుకుంటారని బీజేపీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే తెలిపారు. అయితే ఆలస్యమైనా శీతాకాల సమావేశాలకు ముందే ప్రతిపక్ష నాయకుడి నియామకం జరుగుతుందని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్. రవికుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు కేంద్ర నేతలు సిద్ధమవుతున్నారని, అందుకే ప్రతిపక్ష నాయకుడి పదవి ఎంపిక విషయంలో ఆలస్యం అవుతోందని బీజేపీ నాయకులు కొందరు అంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్న తరువాత మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి కర్ణాటక అసెంబ్లీలో విపక్షాలకు నాయకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే రెండు పర్యాయాలు సీఎం అయిన కుమారస్వామికి అనుభవం ఉందని, ప్రతిపక్షంలో కూడా అధికార పార్టీని ఎండగట్టే అవకాశాలు ఉన్నాయని పలువురు నాయకులు అంటున్నారు.

గత వారం రోజుల నుంచి దుబాయ్‌లో ఉన్న కుమారస్వామి నవంబర్ 4వ తేదీ శనివారం బెంగళూరుకు చేరుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలో కరువు ప్రాంతాల్లో సర్వే కోసం నిజనిర్ధారణ బృందాలను పంపే అంశంపై సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ భేటీలో భాగంగా వారు అసంతృప్త జేడీఎస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతారని భావిస్తున్నామని జేడీఎస్ నేత ఒకరు తెలిపారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications