బీజేపీ వర్సెస్ ఎస్పీ - లా అండ్ ఆర్డర్ ప్రధానాస్త్రంగా : ఎవరి లెక్కలు వారివి..!!
ఉత్తర ప్రదేశ్ లో మూడు విడత పోలింగ్ కు రంగం సిద్దం అవుతోంది. దేశ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్న ఉత్తర ప్రదేశ్ లో మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. అందులో భాగంగా రెండు విడతల్లోనూ ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ప్రచారంలో నేతలు ఒకరి పైన ఆరోపణలు సంధించుకున్నా... పోలింగ్ ప్రక్రియ పైన మాత్రం ప్రభావం పడలేదు. రెండు విడతల పోలింగ్ పైనా ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ సారి ఎన్నికల్లో రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం ప్రధాన ప్రచారస్త్రంగా మారింది.

ఎస్పీ అధికారంలో ఉన్న సమయంలో...
సమాజ్ వాదీ అధికారంలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న ఘటనలను బీజేపీ నేతలు తమ ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. అదే సమయంల ఎస్పీ సైతం యోగీ సీఎం అయిన తరువాత దేశాన్ని కుదిపేసిన ఘటనలను ప్రచార సమయంలో గుర్తు చేస్తున్నారు. దీంతో పాటుగా నిరుద్యోగం, అధిక ధరలు వంటి అంశాలను విపక్ష సమాజ్‌వాదీ పార్టీ ప్రచార అస్త్రంగా మలచుకుంది. ఇదే సమయంలో బీజేపీ.. శాంతి భద్రతల పరిరక్షణను తమ ప్రభుత్వ ప్రధాన విజయంగా చెబుతోంది. శాంతి భద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకున్నామని చెబుతోంది. అయితే, బీజేపీ ప్రబుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఎక్కడైనా ఉన్నా..తమ పాలన చూసిన వారు ఖచ్చితంగా తమ వైపే నిలుస్తారని కాషాయ నేతలు చెబుతున్నారు.

సురక్ష నినాదమే ప్రధాన అస్త్రంగా
ఇందు కోసం ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా సురక్ష నినాదం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఎస్పీ అభ్యర్థుల్లో 55శాతం మంది అభ్యర్థులపై నేరారోపణలు ఉన్నాయని భాజపా నేతలు ఎత్తి చూపుతున్నారు. 2017 ఎన్నికల్లో సమాజ్ వాదీ పైన శాంతి భద్రతల అంశమే ప్రధానంగా ప్రభావం చూపిందనేనది విశ్లేషుల అభిప్రాయం. అదే ఓట్లుగా మారి బీజేపీకి అనూహ్య మెజార్టీకి కారణమైందని విశ్లేషిస్తున్నారు. 2007 లోనూ అదే జరిగింది. యూపీలో 2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీని ఓడించి బీఎస్పీ అధికారంలోకి వచ్చింది. 'గూండాలను అణచివేయాలంటే ఏనుగు గుర్తుకు ఓటెయ్యండి' అని బహుజన సమాజ్ పార్టీ ఆ ఎన్నికల్లో ప్రజలకు పిలుపునిచ్చింది. అధికారంలో ఉన్నా, లేకున్నా నేరగాళ్లతో సమాజ్‌వాదీలకు బలమైన సంబంధాలు ఉంటాయన్నది ప్రధాన ఆరోపణ.
Recommended Video

యోగీ పాలనలో లా అండ్ ఆర్డర్ పైనా..
యోగీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత బుల్లెట్‌కు బుల్లెట్‌తో సమాధానం చెప్పాలని, పోలీసులకు పూర్తి అధికారం ఇస్తున్నానని ఆదిత్యనాథ్ ప్రకటించారు.గత అయిదేళ్లలో పోలీసులు 182 మంది క్రిమినల్స్‌ను హతమార్చారు. చాలా వరకు ఎదురుకాల్పులు బూటకమైనవేనని మానవహక్కుల సంఘాలు ఆరోపించాయి. పోలీసులు వాటిని ఖండించారు. అయితే, యోగీ ముఖ్యమంత్రిగా పాలనలో వివక్ష చూపారంటూ ఆరోపణలుకరడుగట్టిన నేరగాళ్ల ఏరివేతలో భాజపా ప్రభుత్వం వివక్షపూరితంగా వ్యవహరించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో..బీజేపీ ఇప్పుడు దాదాపుగా సురక్ష నినాదంతో ప్రజలకు భరోసా ఇస్తూ ఓట్లు పొందే ప్రయత్నాలు చేస్తోంది. ఇవి ఎంత వరకు ఫలిస్తాయనేది వచ్చే నెల 10వ తేదీన వెల్లడి కానుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications