గంజయి మత్తులో కాలేజ్ గర్ల్ ఫ్రెండ్ ప్రాణం తీసిన ప్రియుడు, బైక్ లో వెళ్లి ?

చెన్నై/కన్యాకుమారి: చదువు మధ్యలో ఆపేసిన యువకుడు చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. గంజాయి. మద్యం మత్తులో బైక్ స్టంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఓ కాలేజ్ అమ్మాయిని వలలో వేసుకున్నాడు. గంజాయి మత్తులో ప్రియురాలిని బైక్ లో పిలుచుకుని వెళ్లాడు. గంజాయి దెబ్బకు రోడ్డు ప్రమాదంలో ప్రియురాలి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కులాచల్ ప్రాంతానికి చెందిన విజు అలియాయ్ విజయ్ పాఠశాలకు వెలుతున్న సమయంలోనే చదువు మానేసి గంజాయి, మద్యానికి బానిస అయ్యాడు. విజు అతని స్నేహితులతో కలిసి బైక్ స్టంట్స్ చేయించడం, ఆ వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌గా అప్‌లోడ్ చేయడం మొదలుపెట్టి యూత్ లో క్రేజ్ సంపాధించుకోవడానికి అలవాటు పడ్డాడు.

weed

ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయితో విజుకు ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం అయ్యింది. ఒకానొక సమయంలో వారి స్నేహం ప్రేమగా మారుతుంది. ఆ తరువాత విజు, కాలేజ్ అమ్మాయి తరచూ కలుసుకుని ప్రేమించుకోవడం మొదలుపెట్టాడు. బైక్ వెనుక ప్రియురాలిని కుర్చోపెట్టుకుంటున్న విజు అతివేగంతో బైక్ నడుపుతూ విహార యాత్రలకు వెళ్లి ఆమెతో ఎంజాయ్ చేశాడు.

గత సోమవారం సాయంత్రం గంజాయి మత్తులో ఉన్న విజు అతని ప్రియురాలిని బైక్‌ లో పిలుచుకుని వెళ్లాడు. కులాచల్ వెస్ట్ కోస్ట్ రోడ్డులో బైక్ లో వేగంగా వెళ్తుండగా కట్టమడై వద్ద బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్‌ కిందపడిపోవడంతో విజుతో పాటు అతని ప్రియురాలు బైక్ లో నుంచి కిందపడిపోయారు. విజుకు చిన్నచిన్న గాయాలు కావడంతో అతని ప్రియురాలి తల బ్యారికేడ్లకు తగిలి తీవ్రగాయాలైనాయి.

ఈ ప్రమాదంలో కాలేజ్ విద్యార్థి తలకు బలమైన గాయాలై స్పృహతప్పి పడిపోయింది. అయితే విజు గంజాయి మత్తులో ఉండడంతో భయాందోళనకు గురై ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న ప్రియురాలిని అక్కడే వదిలేసి బైక్‌ మాత్రమే తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రద్దీగా ఉండే వెస్ట్ కోస్ట్ రోడ్డులో గంటకు పైగా విద్యార్థి అపస్మారక స్థితిలో ఉన్నా ఎవ్వరూ పట్టించుకోలేదు.

weed

అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి కాలేజ్ విద్యార్థినిని రక్షించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. వాట్సాప్ ద్వారా విద్యార్థిని ఫొటోను అతను చాలా మందికి షేర్ చేసి ఆమెను గుర్తించేందుకు ప్రయత్నించాడు. స్వల్పంగా గాయపడిన విజు చికిత్స నిమిత్తం వడియార్‌విలై ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. గంజాయి తాగి ప్రమాదానికి గురైన వ్యక్తి చికిత్స కోసం వచ్చినట్లు అక్కడి వైద్యులు కుళచల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి విజును అదుపులోకి తీసుకుని అతన్ని విచారించారు. మద్యం మత్తులో ఉన్న విజు విద్యార్థినితో బైక్‌పై వెళ్లి ప్రమాదానికి గురై విద్యార్థిని అక్కడే వదిలేసి వచ్చానని విజు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. షాక్‌కు గురైన పోలీసులు విద్యార్థిని వివరాలు అడిగి తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

నాగర్‌కోయిల్‌లోని ఆసరిపాళం ప్రభుత్వాసుపత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స పొందిన కాలేజ్ అమ్మాయి ప్రాణం పోయింది. విద్యార్థి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విజుపై పోక్సో, విద్యార్థిని కిడ్నాప్ చేసి ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోవడానికి కారణం అయ్యాడని రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గంజాయి విక్రయిస్తున్నాడని, గంజాయి సేవిస్తున్నాడని ఇప్పటికే విజు రెండుసార్లు పోలీసులకు చిక్కాడని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+