సహజీవనం, ప్రియురాలిని కట్టర్ తో ముక్కలుగా నరికి కుక్కర్ లో ఉడకబెట్టిన ప్రియుడు!

ముంబాయి: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యకు దూరంగా ఉంటున్నాడు. పెళ్లి చేసుకున్న మహిళ ఆమె భర్తతో కొంతకాలం కాపురం చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం భర్తకు వదిలేసిన మహిళ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నది. భార్యను వదిలేసిన వ్యక్తి అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో గొడవలు జరగడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

ఇంతకాలం ఎంజాయ్ చేసిన ప్రియరాలిని చంపేయాలని ప్రియుడు డిసైడ్ అయ్యాడు. చెట్లు కత్తిరించే కట్టర్ తీసుకుని ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ప్రియురాలి శరీరంలోని ముక్కలను అపార్ట్ మెంట్ లో నుంచి బయటకు తరలించడానికి అతనికి సాధ్యం కాలేదు. తరువాత ప్రియురాలి శరీరంలోని మాంసం ముక్కలను కుక్కర్ లో వేసి ఉడకబెట్టిన ప్రియుడు సాక్షాలు నాశనం చెయ్యడానికి ప్రయత్నించాడు.

The boyfriend who cut the cohabitant Hila into pieces with a cutter and boiled the body parts in a cooker Mumbai

ముంబాయిలోని మీరా రోడ్‌లో అద్దెకు తీసుకున్న అపార్ట్‌మెంట్‌లో మనోజ్ సహాని అలియాస్ మనోజ్ (56) అనే వ్యక్తి సహజీవనం చేస్తున్న భాగస్వామిని చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. నిందితుడు మనోజ్ అతని ప్రియురాలి మృతదేహాన్ని చెట్లు కత్తిరించే కట్టర్‌తో కోసేశాడు. ప్రియరాలి శరీరంలోని భాగాలను కుక్కర్ లో ఉడకబెట్టాడని ముంబాయి పోలీసు వర్గాలు తెలిపాయి.

నిందితుడిని మనోజ్ గత మూడేళ్లుగా గీతానగర్‌లోని 7వ లెవెల్‌లోని గీతా ఆకాష్‌ దీప్‌ బిల్డింగ్‌లోని ఫ్లాట్‌ 704లో నివసిస్తున్నాడు. అదే అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే సరస్వతి వైద్య అలియాస్ సరస్వతి (36 అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. మనోజ్ బోరివలిలో ఓ దుకాణం నడుపుతున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.

బుధవారం సాయంత్రం జూన్ 7వ తేదీన మనోజ్, సరస్వతి నివసించే ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో స్థానికులు నయానగర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, మనోజ్ ఇంట్లో శరీర భాగాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. మూడు నాలుగు రోజుల క్రితమే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన సరస్వతి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. సరస్వతి మృతదేహం పలు భాగాలుగా నరికివేయడం కనిపించింది. మనోజ్ సహానీ, సరస్వతి వైద్య లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇద్దరూ గీతా ఆకాష్ దీప్ బిల్డింగ్‌లో నివసించారు. కొంతకాలం క్రితం నుంచి మనోజ్, సరస్వతిల మధ్య ఏదో విషయంలో గొడవ జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

The boyfriend who cut the cohabitant Hila into pieces with a cutter and boiled the body parts in a cooker Mumbai

ఆ తర్వాత సహజీవనం చేస్తున్న సరస్వతిని మనోజ్ హత్య చేశాడు. సరస్వతి శరీరం ముక్కలు ముక్కలుగా నరికివేశాడు. నిందితుడు మనోజ్ సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు అన్నారు. అయితే ఎట్టకేలకు మనోజ్ చిక్కిపోయాడని ముంబాయి జోన్ వన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ జయంత్ బజ్‌బలే స్థానిక మీడియాకు తెలిపారు.

హత్య వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని డిప్యూటీ పోలీసు కమిషనర్ జయంత్ బజ్‌బలే చెప్పారు. ఢిల్లీలో సహజీవనం చేస్తున్న శ్రద్దా వాకరన్ ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ ఇలాగే 35 ముక్కలుగా నరికేసి శరీరంలోని భాగాలు ఫ్రీజర్ లో దాచిపెట్టి ప్రతిరోజు కొన్ని ముక్కలు తీసుకెళ్లి అనేక ప్రాంతాల్లో విసిరేసిన విషయం తెలిసింది. ఇప్పుడు ఢిల్లీలాంటి సంఘటన ముంబాయిలో వెలుగు చూడటంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+