కాలేజ్ అమ్మాయి శవాన్ని మూటకట్టి బావిలో విసిరేశాడు, గర్బవతిని చేసి క్లైమాక్స్ లో ప్రియుడు ?
చెన్నై/ ఈరోడ్: కాలేజ్ లో యువతి, యువకుడు చేరారు. ఒకేకాలేజ్ లో చదువుతున్న ఇద్దరూ స్నేహితులు అయ్యారు. రానురాను యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కాలేజ్ పూర్తి అయిన తరువాత కాలేజ్ లవర్స్ చెట్టాపట్లాలు వేసుకుని నిర్జనప్రదేశాలకు తిరుగుతూ ఎంజాయ్ చేశారు. కాలేజ్ అమ్మాయి గర్బవతి అయ్యింది. కొంతకాలం తరువాత అదే కాలేజ్ అమ్మాయి బాలిలో గొనె సంచిలో శవమై కనిపించింది.
తమిళనాడులోని ఈ రోడ్ జిల్లాలోని కొంకరపాళయం గ్రామంలో వ్యవసాయ బావిలో ఓ యువతి మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి విసిరేసిన విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో మృతదేహం గోపిచెట్టిపాళయం నాయకన్‌కాడు ప్రాంతానికి చెందిన కాలేజ్ విద్యార్థిని శ్వేతాది అని తేలింది.

దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు శ్వేతా ప్రియుడు లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కాలేజ్ లో చదువుకున్నారని, ఇద్దరూ ప్రేమలో పడ్డారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కాలేజ్ పూర్తి అయిన తరువాత ప్రియురాలు శ్వేతాతో ఎక్కువగా బయటతిరిగిన లోకేష్ ఆమెను శారీరకంగా లొంగదీసుకుని ఆమెను గర్బవతిని చేశాడని పోలీసులు అన్నారు.
ప్రియురాలు శ్వేతాకు అబార్షన్ చేయించడానికి ఆమెను లోకేష్ కోయంబత్తూరులోని ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లాడు. అయితే అబార్షన్ చెయ్యడానికి కోయంబత్తూరులోని ఆసుపత్రి వైద్యులు నిరాకరించారని పోలీసులు చెబుతున్నారు. అనంతరం శ్వేతా కొంకర్లపాలెంలోని లోకేష్ అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ ప్రేమికులు లోకేష్, శ్వేతాల మధ్య గొడవలు జరిగాయి.
అబార్షన్ చేసుకోవాలని ప్రియుడు లోకేష్ శ్వేతా మీద బలవంతం చేశాడు. అబార్షన్ చేసుకుంటేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని లోకేష్ తేల్చిచెప్పాడు. ఆ విషయంలో లోకేష్, శ్వేతాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో శ్వేతా ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అన్నారు. లోకేష్ అతని ప్రియురాలు శ్వేతా మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి బావిలో పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. శ్వేతాను గర్బవతిని చేసి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని, ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని లోకేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications