Rice: సింగపూర్‍కు బియ్యం ఎగుమతి చేసుకోవచ్చు.. ప్రకటించిన కేంద్రం..

కొన్ని ప్రాంతాల్లో వరదలు, కుండపోత వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా ధరల ఒత్తిడి భయాల మధ్య తృణధాన్యాల ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం జూలై 20 న బాస్మతీయేతర బియ్యం ఎగుమతి నిషేధాన్ని విధించింది. అయితే సింగపూర్ కు మాత్రం బియ్యం ఎగుమతికి అనుమతి ఉంది. రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాల దృష్ట్యా సింగపూర్‌కు సరుకును సరఫరా చేయడానికి బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతికి అనుమతి ఇచ్చినట్లు కేంద్రం మంగళవారం ప్రకటించింది.

బియ్యం ఎగుమతిపై నిషేధం విధించినప్పుడు దేశీయ వినియోగ అవసరాల కోసం స్నేహపూర్వక దేశాలు బియ్యం కోసం అభ్యర్థనలు చేస్తే నిషేధానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను రద్దు చేయవచ్చని పేర్కొంది. మినహాయింపును ప్రకటించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ, భారతదేశం, సింగపూర్ మధ్య "చాలా సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యం" ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని సింగపూర్ ఆహార భద్రత అవసరాలను తీర్చేందుకు బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు అనుమతించాలని భారత్ నిర్ణయించింది.

The central government has said that rice can be exported to Singapore

దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. భారత్, సింగపూర్‌ల మధ్య సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యం "భాగస్వామ్య ఆసక్తులు, సన్నిహిత ఆర్థిక సంబంధాలు ఉన్నాయి" అని బాగ్చీ చెప్పారు. ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్)లో భారతదేశానికి అత్యంత సన్నిహిత భాగస్వాములలో ఒకటైన సింగపూర్‌కు సరఫరా చేసే బియ్యం పరిమాణంపై అధికారిక సమాచారం లేదు. రుతుపవనాల ప్రారంభంలో జాప్యం, జులైలో వరదలు సంభవించిన కారణంగా వరి సాగు తగ్గినట్లు చెబుతున్నారు.

"భారత మార్కెట్లో బాస్మతియేతర తెల్ల బియ్యం తగినంత లభ్యతను నిర్ధారించడానికి, దేశీయ మార్కెట్‌లో ధరల పెరుగుదలను తగ్గించడానికి, భారత ప్రభుత్వం పై రకాల ఎగుమతి విధానాన్ని సవరించింది" అని ప్రభుత్వ నోటిఫికేషన్ పేర్కొంది. పారబాయిల్డ్ బియ్యం ఎగుమతులకు అనుమతి కొనసాగుతాయని ప్రకటించింది. ఈ ఉప్పుడు బియ్యం పై కూడా ఎగుమతి సుంకం విధిస్తున్నారు. కాగా ప్రపంచ బియ్యం రవాణాలో భారతదేశ ఎగుమతులు 40% కంటే ఎక్కువ. 2021-22లో భారత్ దాదాపు 22 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+