ఫాస్టాగ్ కు కేంద్ర ప్రభుత్వం గుడ్‌బై... కొత్త టెక్నాలజీ అందుబాటులోకి
కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ వ్యవస్థకు ముగింపు పలకబోతోంది. టోల్‌గేట్ల వద్ద ఛార్జీల వసూలుకు కొత్త పద్ధతిని ఆచరించబోతోంది. జీపీఎస్ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ ఛార్జీలు వసూలు చేయాలని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఒక టోల్ గేట్ నుంచి మరో టోల్ గేట్‌కు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తే జాతీయ రహదారులపై ఒక వాహనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందో గమనించి దాని ఆధారంగా టోల్ ఛార్జీని వసూలు చేస్తారు.
ఏడాదిలోగా దేశవ్యాప్తంగా టోల్ ప్లాజా బూత్‌లను ప్రభుత్వం తొలగించనున్నట్లు మార్చిలో జరిగిన లోక్ సభ సమావేశాల్లో మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. కొత్త పద్దతిలో కదులుతున్న వాహనాన్ని జీపీఎస్ ఇమేజెస్ సహాయంతో ఛార్జీలను వసూలు చేయబోతున్నట్లు తెలిపారు. పలు యూరోపియన్ దేశాల్లో ఈ విధానం విజయవంతమైంది. దీంతో మనదేశంలో కూడా అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. పైలెట్ ప్రాజెక్టు గా ఈ సాంకేతికతను పరీక్షించేందుకు దేశవ్యాప్తంగా 1.37 లక్షల వాహనాలను ఉపయోగించుకోబోతున్నారు.
Recommended Video


జాతీయ రహదారులపై రద్దీ సమయాల్లో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోన్న ఇక్కట్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ఫాస్టాగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా టోల్ బూత్‌ల్లో ఛార్జీలు చెల్లించడాన్ని ప్రారంభించింది. రీఛార్జి చేసుకునే సదుపాయం కూడా ఉండటంతో టోల్ గేట్ల వద్ద వాహనదారులు ఆగకుండా వెళ్లిపోయే సౌలభ్యం ఉంది.












Click it and Unblock the Notifications