Chandrayaan 3: చంద్రుడిపై భారత జాతీయ చిహ్నాన్ని ముద్రించనున్న చంద్రయాన్ 3 రోవర్..

అంతరిక్ష పరిశోధనలో భారత్ ఒక్కో అడుగు వేస్తూ ముందుకెళ్తోంది. అందులో భాగంగా శుక్రవారం మధ్యహ్నం 2 గంటల 35 నిమిషాల 13 సెకన్లకు ఎల్వీఎం-3 చంద్రయాన్ 3 విజయవంతంగా ప్రయోగంచింది. అయితే రోవర్ చంద్రుడిపై దిగితేనే ఈ ప్రయోగం పూర్తి విజయవంతమైనట్లు. 2019లో చంద్రయాన్ 2లో రోవర్ ను చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఈ మిషన్ ఫేలయింది. దీని పాఠాల నేర్చుకున్న ఇస్రో నాలుగు సంవత్సరాల్లోనే చంద్రయాన్ 3 ప్రయోగం ప్రారంభించింది.

చంద్రయాన్ 3 మిషన్ లో భాగంగా వ్యోమనౌక ఆగస్ట్ 23న చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతాన్ని తాకుతుందని భావిస్తున్నారు. ఈ వ్యోమనౌక ఆరు చక్రాల ల్యాండర్, రోవర్ మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఇది చంద్రుని ఉపరితలానికి సంబంధించిన డేటాను అందించడానికి పేలోడ్‌లతో కాన్ఫిగర్ చేశారు. చంద్రుని ఉపరితలంపై రోవర్ కేవలం డేటాను సేకరించడం కాకుండా.. ప్రజ్ఞాన్ అని పిలువబడే రోవర్ వెనుక చక్రాలు ISRO, జాతీయ చిహ్నం గుర్తులను చంద్రుడి ఉపరితలం ముద్రిస్తాయి.

chandraayan31

ఇస్రో తన వెబ్‌సైట్‌లో పంచుకున్న కర్టెన్ రైజర్ వీడియో, చంద్రయాన్-3 మిషన్, సంగ్రహావలోకనం అందిస్తుంది, రోవర్‌పై ఎంబోస్డ్ ముద్రలను కూడా ప్రదర్శిస్తుంది. చంద్రయాన్-2 మిషన్ సమయంలో, దృశ్యమాన దృశ్యాన్ని ఇస్రో తన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా పంచుకుంది. వీడియో చంద్రుని ఉపరితలంపైకి వచ్చిన ల్యాండర్ యానిమేటెడ్ దృశ్యాలను చూపించారు. చంద్రయాన్ ప్రయోగం విజయమంతమైతే.. చంద్రుడిపై మాడ్యూల్ ను విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన యునైటెడ్ స్టేట్స్, మాజీ సోవియట్ యూనియన్, చైనా సరసన భారత్ నిలవనుంది.

రోవర్ చంద్రుడిపై ఉన్న ఉపరితాలన్ని పరిశీలించడమే కాకుండా.. చంద్రుడికి సంబంధించి పలు రహాస్యాలను చేధించే అవకాశం ఉంది. రోవర్ సూర్య రశ్మి ఉన్న చోటే ల్యాండ్ చేయనున్నారు. ఎందుకంటే రోవర్ కు సోలార్ ప్యానల్ అమార్చరు. సూర్య రశ్మి ఉన్న చోట రోవర్ ల్యాండ్ చేయడం వల్ల సోలార్ ప్యానల్ ద్వారా రోవర్ పని చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+