ఉగ్రదాడి: పాక్ ఉగ్రవాది నవెద్‌పై చార్జ్ షీట్

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లోని ఉదమ్ పూర్ లో జరిగిన ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు (ఎన్ఐఏ) కోర్టులో చార్జ్ షీట్ సమర్పించారు. ప్రాణాలతో పట్టుబడిన పాక్ ఉగ్రవాది మహమ్మద్ నవెద్ ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడు అని ఎన్ఐఏ తెలిపింది.

మహమ్మద్ నవెద్ తో పాటు మరో 8 మంది పేర్లు చార్జ్ షీట్ లో పెట్టారు. 2015 ఆగస్టు 5వ తేది జమ్మూ కాశ్మీర్ లోని ఉదమ్ పూర్ లోని బీఎస్ఎఫ్ జవాన్ల మీద లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు విరుచుకుపడి దాడులు జరిపారు.

ఈ దాడిలో ఇద్దరు సైనికులు మరణించారు. సైనికుల ఎదురుదాడిలో ఓ ఉగ్రవాది అంతం అయ్యాడు. మహమ్మద్ నవెద్ మాత్రం ప్రాణాలతో పట్టుబడ్డాడు. స్థానికుల సహకారంతో మిగిలిన నిందితులను అరెస్టు చేశారు.

The charge-sheet also names 8 others as accused in the case

కేసు దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విచారణ చేసి గురువారం ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో చార్జ్ షీటు వేశారు. ఈ కేసులో మహమ్మద్ నవెద్ మొదటి నిందితుడని, ఇంకా కేసు దర్యాప్తు జరుగుతున్నదని అధికారులు కోర్టులో చెప్పారు.

పాకిస్థాన్ కు చెందిన లష్కర్-ఏ-తోయిబా ఈ దాడి చేసిందని ఎన్ఐఏ అధికారులు చార్జ్ షీట్ లో స్పష్టం చేశారు. మహమ్మద్ నవెద్ తదితరులు ఈ దాడి చెయ్యడానికి పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్ లో చొరబడ్డారని చార్జ్ షీట్ లో వివరించారు.

ఈ ఉగ్రదాడి కేసు విచారణలో ఉగ్రవాది మహమ్మద్ నవెద్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడని, ఆ వివరాలు చార్జ్ షీట్ లో పొందుపరిచామని అధికారులు కోర్టులో చెప్పారు. అయితే విచారణ మాత్రం ఇంకా పూర్తి కాలేదని ఎన్ఐఏ అధికారులు చార్జ్ షీట్ లో వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+