ఎలుకలు కూడా డ్రగ్స్ తినేస్తున్నాయా ?, 22 కేజీల గంజాయి స్వాహా, కోర్టులో కేసు !
చెన్నై/వైజాగ్: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం, అరకుతో పాటు పరిసర ప్రాంతాల నుంచి గంజాయి ఇతర రాష్ట్రాలకు జోరుగా సరఫరా అవుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే బెంగళూరు, చెన్నైలో వైజాగ్ నుంచి రైలులో గంజాయి సరఫరా చేస్తున్నారని కేసులు నమోదు అయ్యాయి. ఒక కేసులో సీజ్ చేసిన 22 కేజీల గంజాయిని ఎలుకలు తినేశాయని పోలీసులు కోర్టులో చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
గంజాయి నిల్వ చేసి సామాన్య ప్రజలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. ఇద్దరు నిందితుల నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు కోర్టులో ఇంతకు ముందే చెప్పారు. నిందితులను అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు కోర్టులో చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసు గోదాములో భద్రపరిచారు.

దాదాపు 22 కిలోల గంజాయిని ఎలుకలు తిన్నాయని చెన్నై పోలీసులు కోర్టుకు చెప్పారు. మొత్తం 22 కిలోల గంజాయిలో 50 గ్రాములు మాత్రమే సాక్ష్యంగా పోలీసులు కోర్టుకు అందించారు. ఈ నేపథ్యంలో కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. మిగిలిన 50 గ్రాముల గంజాయిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ఎలుకలు మొత్తం 21. 95 కిలోల గంజాయిని తిన్నాయని పోలీసులు కోర్టుకు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
2022లో తమిళనాడు రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారని స్థానిక పోలీసులు రాజగోపాల్, నాగేశ్వరరావులను అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్టు చేసిన తరువాత ఇద్దరిని కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితుల నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అప్పట్లోనే పోలీసులు కోర్టుకు చెప్పారు.

ఆ తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితులపై చార్జిషీటు దాఖలు చేపి కోర్టుకు సమర్నించారు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని కోర్టు ముందు పెట్టాలని న్యాయమూర్తి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే పోలీసులు గోదాములో పెట్టిన గంజాయిని ఎలుకలు తినేశాయని, 22 కేజీల్లో కేవలం 50 గ్రాముల గంజాయి మాత్రమే మిగిలిందని పోలీసులు కోర్టులో చెప్పారు.
ఎలుకలు గంజాయి, ఇతర మత్తు పదార్థాలను తినడం ఇదే మొదటిసారి కాదని చెన్నై పోలీసులు కోర్టుకు తెలిపారు. 2022 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఇలాంటి ఘటనే జరిగిందని, ఎలుకలు 500 కిలోల గంజాయిని తినేశాయని, గంజాయిని స్వాధీనం చేసుకుని జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల గోదాముల్లో నిల్వ చేశారని కోర్టుకు చెప్పారు. అయితే మెరీనా బీచ్ లో రాజగోపాల్, నాగేశ్వరావు గంజాయి విక్రయిస్తున్నట్లు ఎలాంటి సాక్షాలు లేవని వెలుగు చూడటంతో ఇద్దరిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.
ఏడాది తరువాత గంజాయి విక్రయం కేసులో కోర్టుకు ఆధారాలు అందించడంలో పోలీసులు విఫలం కావడంతో కేసు కొట్టేశారని నిందితుల తరపు న్యాయవాదులు అంటున్నారు. మొత్తం మీద చెన్నైలోని పోలీసు గోదాములు ఎలుకలు 22 కేజీల గంజాయి తినేశాయని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications