సొంత పార్టీ ఎమ్మెల్యేల దెబ్బ, దిగివచ్చిన సీఎం, ఒకేసారి 146 మంది తహసిల్దార్లు !

బెంగళూరు: కర్ణాటకలో మెజారిటీ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సిద్దరామయ్య ప్రభుత్వంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ముచ్చటగా మూడు నెలలు కూడా పూర్తి కాకముందే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంలోని మంత్రుల తీరుపై బహిరంగంగా అసహనం వ్యక్తం చెయ్యడం కలకలం రేపింది. సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం అసమ్మతి శాసన సభ్యులను బుజ్జగించేందుకు ముందుకు వచ్చింది.

కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం అనంతరం శుక్రవారం ఒక్కరోజే రాత్రికి రాత్రి ఒకే సారి 146 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలలు పూర్తి కాకముందే అనేక మంది ఎమ్మెల్యేలు అంతర్గత వ్యవహారాల్లో ప్రభుత్వం మీద మండిపడుతున్నారు.

siddaramaihvidhanasoudha1

ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిని చల్లార్చేందుకు కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే శుక్రవారం జరిగిన సీఎల్ పీ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసి మంత్రుల మీద మండిపడ్డారని తెలిసింది. ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి ఎమ్మెల్యేలు కోరుకున్న తహసీల్దార్లకే ఆయా ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చారు.

తహశీల్దార్ల బదిలీలకు సంబంధించి ఒకేరోజు మూడు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. 84 మందిని ఒకసారి, 46 మందిని ఒకసారి, 16 మందిని తహశీల్దార్లను ఒకసారి బదిలీ చేస్తూ వేర్వేరుగా సిద్దరామయ్య ప్రభుత్వం ఒకే రోజు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 12 మంది తహసీల్దార్లను ప్రస్తుత స్థానంలో కొనసాగించారు. ఇది బదిలీ ఆదేశాల్లో తెలిపింది. మొత్తం 146 మంది గ్రేడ్-1, గ్రేడ్-2 తహసీల్దార్లను మూడు విడతలుగా బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆమోదం తెలిపిన నేపథ్యంలో శనివారం నుంచే ఉత్తర్వులు అమలులోకి వస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు.

siddaramaiah6
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ నియోజకవర్గాలో సకాలంలో పనులు జరగడానికి తహశీల్దార్ల బదిలీలు, అధికారుల పోస్టింగ్‌లకు సంబంధించి వారి సిఫార్సులు మరియు అభ్యర్థనలను మంత్రులకు తెలియజేశారు. అయితే ఎమ్మెల్యేలు కోరుకున్నంతగా అధికారుల నియామకం జరగకపోవడంతో ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది.

ఈ విషయంలో 30 మందికి పైగా ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య ప్రభుత్వంపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయడంతో పాటు కాంగ్రెస్ శాసనసభలో కూడా దీనిపై చర్చించినట్లు సమాచారం. ఎమ్మెల్యేల దెబ్బకు ఒకే రోజు 146 మంది తహసిల్దార్లు బదిలి కావడం కలకలం రేపింది. దెబ్బకు సీఎం ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి వారిని బుజ్జగించి అధికారులను బదిలి చేచశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+