ప్రముఖులకు పెద్ద పీట వేసిన హైకమాండ్, ఫ్యామిలీలో ? సిద్దూ ఏక్ నిరంజన్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా ఈసారి అధికారం మాదే అని కాంగ్రెస్ పార్టీ మంచి జోరు మీద ఉంది. మొదటి విడత, రెండో విడతలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ శనివారం మద్యాహ్నం చాలా సైలెంట్ గా మూడో జాబితాలో 43 మంది పేర్లు విడదల చేసింది.
అయితే ఇంకా 15 నియోజక వర్గాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించకపోవడంతో ఆ నియోజక వర్గంలోని నాయకులు టెన్షన్ టెన్షన్ గా ఉన్నారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మూడో జాబితో చాలా మంది ప్రముఖులు వారి సీట్లు దక్కించుకున్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదికి ఆ మరుసటి రోజే అథణి నియోజక వర్గం సీటు ఇచ్చేశారు.

కోలారులో సిద్దరామయ్య పోటీ చేస్తారని ఇంతకాలం జోరుగా ప్రచారం జరిగింది. అయితే కోలారు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కొత్తూరు మంజునాథ్ కు ఇచ్చేశారు. కోలారు నియోజక వర్గం టిక్కెట్ కొత్తూరు మంజునాథ్ కు ఇవ్వడంతో కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య కేవలం వరుణా నియోజక వర్గానికి మాత్రమే పరిమితం అయ్యారు. కోలారు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు హైకమాండ్ మీద గుర్రుగా ఉన్నారు.
జేడీఎస్ నుంచి కాంగ్రెస్ కు జంప్ అయిన శివలింగేగౌడకు అరిసికెరె సీటు దక్కింది. బెంగళూరులోని బోమ్మనహళ్లి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కన్నడ సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త ఉమాపతి గౌడకు ఇచ్చారు. బోమ్మనహళ్లిలో ఇప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న సతీష్ రెడ్డికి ఈసారి ఉమాపతి గౌడ గట్టిపోటీ ఇస్తారని స్థానిక ఓటర్లు అంటున్నారు.

మాజీ మంత్రి మోటమ్మ కుమార్తె నయనాకు మూడగెరె నియోజక వర్గం టిక్కెట్ దక్కింది. కేంద్ర మాజీ మంత్రి మార్గెర్ అళ్వా కుమారుడు నివేదిత్ అళ్వాకు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. శివమొగ్గ సిటీ నియోజక వర్గం టిక్కెట్ ను ఎస్ సీ. యోగేష్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎలాగైనా విజయం సాధించాలని ధీమాతో ఉంది. మొత్తం మీద సైలెంట్ గా మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అసమ్మతి పెరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications