Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీ సీఎం స్కెచ్ కు రివర్స్ గేర్ వేసిన హైకమాండ్, సిద్దూ చీటి చింపేసిన సీక్రేట్ సర్వే, ఎక్కడ సార్ ?

మాజీ సీఎంకు ఇప్పుడు ఏ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలో అర్థంకాకపోవడం పెద్ద చర్చకు దారితీసింది. మాజీ సీఎం చీటిని హైకమాండ్ సీక్రేట్ సర్వే చింపేయడం హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరు/కోలారు/కేజీఎఫ్: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైయ్యింది. ఎమ్మెల్యే టిక్కెట్లు సంపాధించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. సిట్టింగ్ లుకు కొన్ని నియోజక వర్గాల్లో సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని తెలిసింది. అయితే మాజీ సీఎంకు ఇప్పుడు ఎక్కడ నుంచి పోటీ చెయ్యాలో అర్థంకాకపోవడం పెద్ద చర్చకు దారితీసింది. ఆంధ్రా బార్డర్ నుంచి పోటీ చెయ్యాలని ఇన్ని రోజులు తీరకలేకుండా ఆ నియోజక వర్గం నాయకులతో చర్చలు జరిపిన మాజీ సీఎంకు హైకమాండ్ షాక్ ఇచ్చింది. మాజీ సీఎం చీటిని హైకమాండ్ సీక్రేట్ సర్వే చింపేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

కర్ణాటకలో కౌంట్ డౌన్

కర్ణాటకలో కౌంట్ డౌన్

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి కూడా మేమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు కర్ణాటకలో పర్యటించారు. ఇక కాంగ్రెస్ మాత్రం చావుబతుకుల మధ్య పోరాడుతూ ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇక జేడీఎస్ మాత్రం ఎప్పటిలాగే కింగ్ మేకర్ మేమే అంటూ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది.

మధ్యలో వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి

మధ్యలో వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి

కర్ణాటకలో ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల (BJP, Congress, JDS) మధ్య పోటీ ఉంది. అయితే బీజేపీకి గుడ్ బై చెప్పి కేఆర్ పీ పార్టీ పెట్టిన మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కూడా ఉత్తర కర్ణాటకలో సత్తా చాటుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బళ్లారి, రాయచూరు. చిత్రదుర్గా, విజయనగరంతో పాటు ఉత్తర కర్ణాటకలోని పలు జిల్లాల్లో గాలి జనార్దన్ రెడ్డికి మంచి పట్టుఉంది. గతంలో బీజేపీలో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఆ జిల్లాలో ఆయనకంటూ ప్రత్యేక అనుచరులు, అభిమానులను సంపాధించుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో గాలి జనార్దర్ రెడ్డి కారణంగా బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

మాజీ సీఎం సిద్దూ ?

మాజీ సీఎం సిద్దూ ?

గత శాసన సభ ఎన్నికల్లో (2018) అప్పటి సిట్టింగ్ సీఎం సిద్దరామయ్య (CM) బాదామి నిమోజక వర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలోని కోలారు నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని సిద్దరామయ్య డిసైడ్ అయ్యారు. సిద్దరామయ్య కుమారుడు, వరుణ నియోజక వర్గం ఎమ్మెల్యే డాక్టర్ యతీంధ్ర ఇప్పటికే రెండు మూడు సార్లు కోలారులో సర్వే చేపించారు. తన తండ్రి సిద్దరామయ్య కోలారులో విజయం సాధిస్తారా?, ఎంత మెజారిటీ వస్తుంది ? అని సర్వే చేపించారు. ఇప్పటికే కోలారు నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులతో పలుసార్లు సమావేశం అయిన సిద్దరామయ్య అక్కడ గెలుపుపై ధీమాతో ఉన్నారు.

షాక్ ఇచ్చిన హైకమాండ్

షాక్ ఇచ్చిన హైకమాండ్

కోలారు అసెంబ్లీ నియోజక వర్గంలో సిద్దరామయ్య శిష్యుడు వర్తూరు ప్రకాష్ రెండుసార్లు స్వతంత్రపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వర్తూరు ప్రకాష్ కు రాజకీయ గురువు సిద్దరామయ్య. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా వర్తూరు ప్రకాష్ కోలారు నుంచి పోటీ చేస్తున్నారు. గురుశిష్యుల మధ్య పోటీ ఉంటుందని కోలారు ప్రజలు అనుకున్నారు. అయితే సిద్దరామయ్య కోలారు నుంచి పోటీ చెయ్యడం సొంత పార్టీలోని కొందరికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇదే సమయంలో కోలారులో కొందరు సీక్రేట్ గా సర్వే చేసి కాంగ్రెస్ హైకామండ్ కు నివేదిక పంపించారు. ఢిల్లీ వెళ్లిన సిద్దరామయ్యకు మీరు కోలారు వదిలేసి వేరే నియోజక వర్గం చూసుకుని అక్కడి నుంచి పోటీ చెయ్యండి అని హైకమాండ్ సూచింయడంతో మాజీ సీఎం సిద్దరామయ్య షాక్ అయ్యారు.

త్యాగం చెయ్యడానికి సిద్దం అయిన కొడుకు

త్యాగం చెయ్యడానికి సిద్దం అయిన కొడుకు

కోలారు నుంచి సిద్దరామయ్య పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించకపోవడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు, వరుణ నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ సీఎం సిద్దరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర తన తండ్రి ఎక్కడి నుంచి అయినా పోటీ చేసి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే వరణ నియోజక వర్గం నుంచి సిద్దరామయ్య పోటీ చేస్తారని డాక్టర్ యతీంధ్ర హింట్ ఇచ్చారు.

హైకమాండ్ ఎందుకు చెప్పిందో తెలీదు

హైకమాండ్ ఎందుకు చెప్పిందో తెలీదు

తాను మాత్రం వేరే నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యనని, వరుణా నుంచి తన తండ్రిని గెలిపించుకుంటానని, తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పని చేస్తానని డాక్టర్ యతీంద్ర అన్నారు. కోలారు నుంచి తన తండ్రి సిద్దరామయ్యను పోటీ నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ హైకాండ్ ఎందుకు చెప్పిందో అర్థం కావడం లేదని, అయితే హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని కోలారు నుంచి తన తండ్రి సిద్దరామయ్య పోటీ నుంచి తప్పుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సిద్దూ కుమారుడు డాక్టర్ యతీంద్ర అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+