Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తేనె తుట్టె కదిపిన కాంగ్రెస్..!!

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికాలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో చేసిన ప్రసంగం క్రమంగా వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజకీయ వేడిని రాజేశాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేశాయి.

తన అమెరికా పర్యటన సందర్భంగా జార్జ్‌టౌన్ యూనివర్శిటీని సందర్శించారు రాహుల్ గాంధీ. అక్కడి విద్యార్థులను కలిశారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సమయంలో రిజర్వేషన్ల అంశం ప్రస్తావనకు వచ్చింది. భారత్‌లో అందరికీ సమాన అవకాశాలు లభించినప్పుడు రిజర్వేషన్లను రద్దు చేస్తామని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవనీ వివరించారు.

The Congress party has a complicated relationship with reservations and affirmative action

కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడిగా, ఆ పార్టీ ప్రతిపక్ష నేతగా ఆయన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. రిజర్వేషన్ల రద్దు వ్యవహారం కాంగ్రెస్ పార్టీ నిర్ణయమేననే చర్చకు తావిచ్చినట్టయింది. రిజర్వేషన్ల కొనసాగింపుపై తన విధానపరమైన నిర్ణయం ఏమిటో రాహుల్ గాాంధీ చెప్పకనే చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఇది- దేశ సామాజిక సమతౌల్యాన్ని దెబ్బ తీస్తుందని, రిజర్వేషన్ల వల్ల లబ్ది పొందుతున్న వారి విస్తృత ప్రయోజనాలకు విఘాతంలా పరిణమిస్తుందనే ఆందోళనలకు తెర తీసినట్టయింది. జాతీయ స్థాయిలో పలు రాజకీయ పార్టీలు దీనిపై స్పందించాయి. రాహుల్ వ్యాఖ్యలను తప్పుపట్టాయి.

నిజానికి- రిజర్వేషన్లతో కాంగ్రెస్ పార్టీకి సంక్లిష్టమైన సంబంధం ఉంది. రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో తరచుగా అట్టడుగు వర్గాల ఛాంపియన్‌గా నిలుస్తుంటుంది. చరిత్రను నిశితంగా పరిశీలించగలిగితే మాత్రం కొన్ని లోపాలు ప్రస్ఫూటంగా కనిపిస్తాయనడంలో సందేహాలు అక్కర్లేదు.

రిజర్వేషన్ల విషయంలో పార్టీ వ్యవస్థాపకుడు, తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ విస్తృతమైన ప్రయోజనాలను అమలు చేయడానికి వెనుకాడారు. అనంతరం ఇందిరా గాంధీ పదవీకాలం కూడా కీలకమైన రిజర్వేషన్ల విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించారనే అభిప్రాయాలు ఉన్నాయి. మాజీ ప్రధాని, రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ఓబీసీలను మూర్ఖులుగా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి అట్టడుగు వర్గాలకు నిజమైన సాధికారత కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతపై ప్రశ్నలను లేవనెత్తారు. రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి అంటూ ఆరోపించారు.

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పట్టినట్టయింది. అవకాశం ఇస్తే రిజర్వేషన్ విధానాలను రద్దు చేయడానికి లేదా వాటి ప్రయోజనాల్లో కోత పెట్టడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుందనే భయాలను రేకెత్తించింది. రిజర్వేషన్ల రద్దు వ్యవహారం సామాజిక సమతౌల్యాన్ని దెబ్బతిస్తుందనే ఆందోళనలకు ఆజ్యం పోసినట్టయింది.

దశాబ్దాలుగా ఆర్థిక, సామాజిక సంస్కరణలు ఉన్నప్పటికీ, కుల ఆధారిత అసమానత అనేది ఇంకా కొనసాగుతోందనేది కఠోర సత్యం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల.. వారికి ఎంతో ప్రయోజనకారిగా, ఆ అసమానతలను తొలగించేదిగా ఉంటూ వస్తోంది. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యాలలో అవకాశాలను కల్పిస్తోంది.

కులం, సామాజిక, ఆర్థిక స్థితి అనేది- కోట్లాది మందికి విద్య, ఉపాధి, ప్రాథమిక హక్కుల రంగాల్లో సమాన అవకాశాలను కల్పించలేకపోతోంది. అలాంటి సందర్భంలో ఆ సామాజిక వర్గాల వారికి సాధికారత కోసం చారిత్రక తప్పులను సరిదిద్దడం అవసరం.

ఈ సమానత్వం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక విధానపరమైన నిర్ణయాలను తీసుకుంటోంది. దానికి అనుగుణంగా పథకాలను ప్రవేశపెడుతోంది. ఆ అసమానతలను తొలగించడానికి కృషి చేస్తోంది.

2005 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 93వ సవరణ.. రాజ్యాంగబద్ధంగా మైనారిటీ సంస్థలకు లభించాల్సిన రిజర్వేషన్ల నుంచి మినహాయించింది. ఈ చర్య చారిత్రాత్మకంగా అట్టడుగున ఉన్న సామాజిక వర్గాల కంటే మైనారిటీలకు అనుకూలంగా ఉండటం ద్వారా రాజకీయ లబ్దిని పొందే ప్రయత్నంగా భావించారు.

దీనికితోడు- అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ, జామియా మిలియా ఇస్లామియా వంటి ప్రభుత్వ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను కాంగ్రెస్ అమలు చేయడం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉన్నత విద్యను మరింత దూరం చేసింది. అన్ని సామాజిక వర్గాల వారి విస్తృత ప్రయోజనాల కంటే కూడా మైనారిటీల బుజ్జగింపునకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్టయింది.

రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్లను, ముఖ్యంగా ముస్లింలను ఏకం చేస్తూ హిందూ సామాజిక వర్గాల వారిని విభజించడానికి రిజర్వేషన్లను ఒక సాధనంగా చూస్తోందనే విమర్శలు ఉన్నాయి.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉద్దేశపూరకమా? కాదా? అనేది పక్కనపెడితే దేశంలో అన్ని సామాజిక వర్గాల విస్తృత ప్రయోజనాల భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే చర్చల తెర తీసింది. భవిష్యత్తులో రిజర్వేషన్లను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిజంగా భావిస్తోన్నట్టయితే- అది దేశ సామాజిక నిర్మాణాన్ని పతనం చేస్తుందనే ఆందోళనలు ఉన్నాయి.

ఏది ఏమైనప్పటికీ- న్యాయబద్ధత సాధించిన అనంతరం రిజర్వేషన్లను రద్దు చేయడం అనే భావన ఓ సమస్యాత్మకమైనదే. అతి పెద్ద ప్రజాస్వామ్య, వైవిధ్య భరిత సమాజంలో రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఆలోచన రావడం.. దశాబ్దాల పురోగతికి విఘాతంలా మారే ప్రమాదం లేకపోలేదు. దీనివల్ల సమాజంలో అత్యంత వెనుకబడిన వాళ్లు.. మరింత అణచివేతకు గురి అవుతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+