సీఎం సీటుతో మీ పంచాయితీలు పెరిగిపోయాయి, మాకు టైమ్ లేదు, ఢిల్లీ వచ్చేయండి !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చినా ఆ పార్టీ హైకమాండ్ సీఎం అభ్యర్థిని ప్రకటించలేక పోయంది. కాంగ్రెస్ పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలతో పాటు కొందరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించినా ఇంటి పోరు దెబ్బతో కాంగ్రెస్ పార్టీ నాయకులు హడలిపోయారు
ఆహో ఓహో అంటూ ఆదివారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాయకులు సీఎల్ పీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకున్న ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలు బిక్క ముఖం వేశారు. తరువాత భోజనాలు అయిన తరువాత ఎమ్మెల్యేల అభిప్రయాలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాయకులు తెలుసుకున్నారు.

పనిలో పనిగా వింధు భోజనం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడి వారి అభిప్రయాలు తెలుసుకున్నారు. ఇదే సమయంలో మీరు ఢిల్లీకి రావాలని మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే తో మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ తో రాజీ చర్చలు మొదలుపెడుతాయని తెలిసింది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ కు సీఎం సీటు విషయంలో లోలోపల మనస్పర్థలు మొదలుకావడంతో ఇద్దరు నాయకులు ఇప్పుడు ఢిల్లీకి వెలుతున్నారు.












Click it and Unblock the Notifications