సిద్దూకు చెక్ ?, చేసింది చాలు మా కథ చూడండి, లోకల్, నాన్ లోకల్ తో సీఎం సీటు?
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని మెజారిటీతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆపరేషన్ కమల లేదు తొక్కాలేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవసరం అయ్యే మ్యాజీక్ ఫిగర్ దాటిపోయిన కాంగ్రెస్ పార్టీ చేతిలో ఇంకా 22 మంది ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారు.
బీజేపీ, జేడీఎస్ పార్టీలు కలిసినా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానిక అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో ఇప్పుడు ఆపార్టీలో ఎవరిని సీఎం చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చర్చలు జరుపుతోంది.

కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ల మధ్య సీఎం సీటు కోసం గట్టిపోటీ ఉంది. ఈ ఇద్దరు నాయకుల మధ్యనే సీఎం పదవి నీకా ? నాకా ? అంటూ మొదటి నుంచి పోటీ ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో సీఎం కుర్చీ కోసం చాలా మంది పోటీ చేస్తున్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున ఖార్గే పేరు కూడా తెరమీదకు వచ్చింది. దళితుడిని సీఎం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకా మంచి పేరు వస్తుందని కొందరు నాయకులు డిమాండ్ తెచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన మల్లికార్జున ఖార్గే కుమారుడు. కర్ణాటక మాజీ మంత్రి ప్రియాంక ఖార్గే పేరు కూడా తెరమీదకు వచ్చింది.
ఐసీసీ అధ్యక్ష పదవిలో ఉన్న మల్లికార్జున్ ఖార్గేతో పాటు ఆయన కుమారుడు ప్రియాంక ఖార్గే కూడా సీఎం రేసులో ఉండటం హాట్ టాపిక్ అయ్యింది. దళితులను సీఎం చెయ్యాల్సి వస్తే కేంద్ర మాజీ మంత్రి కేహెచ్. మునియప్ప, కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ కూడా సీఎం రేసులో ఉన్నారు. లింగాయత్ వర్గానికి చెందిన మాజీ మంత్రి ఎంబీ పాటిల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్ వీ. దేశ్ పాండే, రామలింగా రెడ్డి సీఎం రేసులో ఉన్నారని వెలుగు చూసింది.
ఆదివారం బెంగళూరులో సీఎల్ పీ సమావేశానికి రంగం సిద్దం అవుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారిలో ముఖ్యంగా రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి డీకే శివకుమార్ వర్గం, ఇంకోటి సిద్దరామయ్య వర్గం, ఎవరికి వాళ్లు తమ నాయకుడిని సీఎం చెయ్యాలని ఆదివారం డిమాండ్ చేసే అవకాశం ఉందని తెలిసింది.
ఒకవేళ సిద్దరామయ్యను సీఎం చెయ్యాలని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ప్రతిపాధిస్తే లోకల్, నాన్ లోకల్ నినాదం తెరమీదకు తీసుకురావాలని కొందరు నాయకులు ఆలోచిస్తున్నారని తెలిసింది. జేడీఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన సిద్దరామయ్య ఇప్పటికే ఓసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
తరువాత బీజేపీ అధికారంలోకి రావడంతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులను సీఎం చెయ్యాలని, ఇప్పటికే సిద్దరామయ్యకు ఓ చాన్స్ ఇచ్చామని, దశాభ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు న్యాయం చెయ్యాలని కొందరు నాయకులు డిమాండ్ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత అంటున్నారు.
2018లోనే కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తే సిద్దరామయ్యను సీఎం కాకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే 2018లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కుమారస్వామి సీఎం అయ్యారు. అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన సిద్దరామయ్యకు కాకుండా పార్టీలో ముందు నుంచి ఉండే నాయకులలో ఎవరికో ఒకరికి సీఎంగా అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేసే అవకాశం ఉందని తెలిసింది.
లోకల్ నాన్ లోకల్ నినాదం తెరమీదకు వస్తే మల్లికార్జున్ ఖార్గే లేదా డీకే శివకుమార్ లకు సీఎం అయ్యే చాన్స్ ఎక్కువగా ఉందని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని విషయం ఆదివారం రాత్రి వరకు వేచిచూడాలి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications