మోదీని గద్దె దింపితేనే దేశం బాగుపడుతుంది..! బీజేపి సర్కార్ పై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ..!!
హైదరాబాద్: కేంద్ర బీజేపి ప్రభుత్వం పై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండి పడ్డారు. మోదీ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేంద్ర సర్కార్ ఏర్పాటులో తృణమూల్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల తర్వాత పార్టీల మధ్య పొత్తులు కుదిరే అవకాశాలు ఉన్నాయని దీదీ తెలిపారు. రాయిగంజ్‌లో జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. మోదీని సాగనంపేందుకు అన్ని రాష్టాల్లోనూ పొత్తులు కుదిరాయని, మోదీని గద్దెదింపిన తర్వాత, నవ భారత నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.

అంతే కాకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి బంగ్లా అన్న పేరు పెట్టేందుకు బీజేపీ నిరాకరించిందన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఏకపక్ష తీర్మానం జరిగినా, కేంద్రం మాత్రం రాష్ట్ర పేరును మార్చేందుకు నిరాకరిస్తోందని దీదీ ఘాటుగా విమర్శించారు. బీజేపీ ఎదగడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ పోరాటం చేయలేకపోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే కాషాయ పార్టీ పుంజుకుందన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో తృణమూల్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. ఆ పార్టీ ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సి ఉంటుందన్నారు మమతా బెనర్జీ.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications