ఫోర్త్ వేవ్ సంకేతాలా - భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు : కరోనా బారిన ప్రముఖులు..!!

కరనా మరోసారి విస్తరిస్తోంది. దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా.. 4,518 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 9 మంది చనిపోయారు. ఆదివారం 2,779 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.73 శాతం వద్ద స్థిరంగా ఉంది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది. కేసులు మరోసారి పెరుగుతున్న వేళ ఫోర్త్ వేవ్ పైన ఆందోళన పెరుగుతోంది. అయితే, నిపుణులు కొత్త విశ్లేషణలు చేస్తున్నారు.

దేశంలో కరోనా నాలుగో వేవ్‌ వచ్చే అవకాశం లేదని ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్లు చెబుతున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలను విశ్లేషిస్తున్నారు. కొత్త మ్యుటెంట్లు లేకపోవడం ఒకటి కాగా.. మొదటి మూడు వేవ్‌ల్లో అత్యధికులు వైరస్‌ బారిన పడిన నేపథ్యంలో దేశ జనాభాలో దాదాపు 90 శాతం మందికి కరోనాను ఎదుర్కొనే సహజ రోగనిరోధక శక్తి ఏర్పడటం రెండవదిగా విశ్లేషిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 4,31,81,335 గా ఉంది. మరణాల సంఖ్య 5,24,701గా నిర్దారించారు. ఇక, యాక్టివ్ కేసులు 25,782 ఉండగా.. కోలుకున్నవారి సంఖ్య 4,26,30,852 గా ఉంది. ప్రపంచదేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 297,830 మంది వైరస్​ బారినపడ్డారు. 476 మరణాలు నమోదయ్యాయి. ఇక, దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల్లో భాగంగా పలువురు ప్రముఖులు సైతం ఈ మహమ్మారి బారిన పడ్డారు.

The countrys active cases increased to 25,782 on Monday, the Health Ministry data revealed.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రియాంక గాంధీకి కరోనా వైరస్ సోకింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ఖాన్‌కు వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. బాలీవుడ్‌ అగ్ర కథానాయిక కట్రీనా కైఫ్‌కు కొద్దిరోజుల క్రితమే కరోనా సోకినా.. ఆ విషయం ఆలస్యంగా బయటపడింది. ఇంకా... అక్షయ్‌ కుమార్‌, కార్తీక్‌ ఆర్యన్‌, ఆదిత్యరాయ్‌కపూర్‌ సహా పలువురు బాలీవుడ్‌ నటులు గత నెలరోజుల్లో వైరస్‌ బారిన పడ్డారు. దీంతో, కేంద్రం తాజాగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న అయిదు రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఎక్కడకికక్కడ నిర్దారణ పరీక్షలు చేయాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+