బడ్జెట్ తేదీ, సమయం మార్పు వెనుక..!!
Union Budget 2025: కేంద్ర బడ్జెట్ కోసం పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. కేంద్రంలో మోదీ మూడో సారి వరుసగా ప్రధాని అయిన తరువాత పూర్తి స్థాయిలో ప్రవేశ పెడుతున్న వేళ అంచనా లు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో బడ్జెట్ కు సంబంధించి అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో బడ్జెట్ ప్రవేశ పెట్టే తేదీ... సమయం లో మార్పు జరిగింది. ఈ నిర్ణయం ప్రధాని మోదీ ప్రభుత్వంలోనే నిర్ణయం జరిగింది.
బడ్జెట్ పై ఆసక్తి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో 2025-26 బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది. కేంద్రం ఈ సారి ప్రవేశ పెట్టే బడ్జెట్ పైన అనేక రంగాల ప్రముఖులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పన్ను మినహాయింపుల కోసం సామాన్యులు నిరీక్షిస్తున్నారు. మోదీ ప్రధాని అయిన సమయం నుంచి బడ్జెట్ ప్రవేశ పెట్టటం నుంచి ప్రతిపాదనల వరకు పలు మార్పులు చోటు చేసుకున్నాయి. గతం లో బడ్జెట్ ను పార్లమెంట్‌లో సాయంత్రం 5.00 గంటలకు ప్రవేశపెట్టేవారు. కానీ ఆ సమయాన్ని ఉదయం 11.00 గంటలకు మార్చారు.

1999 లో మార్పులు
అదే విధంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే బడ్జెట్ కావటంతో ఫిబ్రవరి నెల చివరి రోజున పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేవారు. సాయంత్రం వేళ తొలుత బడ్జెట్ ప్రవేశ పెట్టటం వెనుక పలు కార ణాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ సమయం కోసం గతంలో సాయంత్రం వేళ బడ్జెట్ ప్రవేశ పెట్టేవారు. సాయంత్రం వేళ భారత్ లో బడ్జెట్ ప్రవేశ పెడితే ఇంగ్లాండ్ లో ఉదయం సమయంలో బడ్జెట్ పైన చర్చ జరిగేది. కానీ, దీనిని 1999 లో వాజ్‌పేయి నేతృత్వంలోని ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. కేంద్ర ఆర్థిక బడ్జెట్ ఉదయం 11.00 గంటలకు పార్లమెంట్‌కు సమర్పించాలని నిర్ణయించారు. 1999, ఫిబ్రవరి 27వ తేదీన యశ్వంత్ సిన్హా దేశంలో తొలిసారిగా ఉ. 11.00 గంటలకు పార్లమెంట్‌కు బడ్జెట్‌ను సమర్పించారు.
సమయం - తేదీ
అప్పటి నుంచి ప్రతీ బడ్జెట్ పార్లమెంట్ లో ఉదయం 11 గంటలకే ప్రవేవ పెడుతున్నారు. ఏ ప్రభుత్వం ఏర్పడినా ఇదే నియమం కొనసాగిస్తున్నారు. ఇక, బడ్జెట్ ను ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టే లా నిర్ణయం తీసుకున్నది మోదీ హయాంలోనే. 1999 నుండి 2017 వరకు.. అంటే దాదాపు 20 ఏళ్ల పాటు.. ఫిబ్రవరి మాసం చివరి పని దినం రోజు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. కానీ ఈ సంప్రదాయాన్ని 2017లో మార్పు చేసారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. పార్లమెంట్‌లో బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన సమర్పించారు. దీంతో..అప్పటి నుంచి ఇప్పుటి వరకు అందరు ఆర్దిక మంత్రు లు రైల్వే బడ్జెట్ తో కలిపి సాధారణ వార్షిక బడ్జెట్ ను ప్రతీ ఫిబ్రవరి 1న ప్రవేశ పెడుతున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications