Attack on Parliament 2001:దేశ ప్రజాస్వామ్యం పై ఉగ్రదాడికి 22 ఏళ్లు..నాడు ఏం జరిగింది..?
Attack on Indian Parliament:ప్రజాస్వామ్యంపై ఉగ్రదాడికి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. అవును భారత పార్లమెంట్ భవనంపై పాక్ నేతృత్వంలో ఉగ్రదాడి 2001 డిసెంబర్ 13వ తేదీన జరిగింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే ఈ దారుణం చోటుచేసుకుంది.ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా ఇందులో ఆరుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఈ ఘటనలో భారత భద్రతా సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడగా... మరోవైపు ఉగ్రదాడుల చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి. "పార్లమెంట్ భవనంపై ఉగ్రదాడి పాకిస్తాన్ మద్దతుగా నిలిచిన ఉగ్రసంస్థలైన లష్కర్-ఈ-తోయిబా, జైష్-ఈ-మొహ్మద్ సంయుక్తంగా నిర్వహించాయి" అని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఎల్‌కే అద్వానీ సభలో చెప్పారు.
13 డిసెంబర్ 2001 ఏం జరిగింది : 13 డిసెంబర్ 2001 ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ భవనం ఆవరణలోకి ఓ తెల్లరంగు అంబాసిడర్ కారు దూసుకొచ్చింది.భద్రతా దళాలను దాటుకుని ఆ కారు దూసుకొచ్చింది.అయితే వారు ఫేక్ ఐడీ కార్డులు ధరించి కారుకు ఎర్రబుగ్గ పెట్టి భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోపలికి ప్రవేశించారు.పార్లమెంట్ సమావేశాల సమయంలో ఇది జరిగింది. లోక్‌సభ వాయిదా పడిన 40 నిమిషాలకు ఉగ్రవాదులు పార్లమెంట్ భవనం ఆవరణలోకి ప్రవేశించారు.ఆ సమయంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి, విపక్షనేతగా ఉన్న సోనియాగాంధీ పార్లమెంట్ భవనం నుంచి వెళ్లిపోగా మరో 100 మంది ఎంపీలు, కేంద్ర హోంమంత్రి ఎల్‌కే అద్వానీలు ఇంకా భవనంలోనే ఉన్నారు.

ఇదిలా ఉంటే ఉగ్రవాదులు వచ్చిన అంబాసిడర్ కారు నేరుగా అప్పటి ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ కాన్వాయ్‌ను ఢీకొట్టింది.దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు ఏకె-47 తుపాకులతో ఎదురుకాల్పులకు దిగారు. అంతేకాదు బాంబులను కూడా ఆవరణలో విసిరారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అదే సమయంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఢిల్లీ పోలీసులు ఐదుగురు,పార్లమెంట్ సెక్యూరిటీ గార్డ్, ఓ తోటమాలి మృతిచెందారు. ఈ భీకర ఎన్‌కౌంటర్ దాదాపుగా గంటపాటు కొనసాగింది.
ఓవైపు భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల మధ్య భీకరపోరు సాగుతుండగానే మరోవైపు పార్లమెంట్ భవనంలో ఉన్న మంత్రులను ఎంపీలను సురక్షితంగా మరో చోటికి తరలించారు.ఈ మొత్తం ఘటనను పలు టెలివిజన్ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి.ఓ ఉగ్రవాది అయితే తనతో పాటు తెచ్చుకున్న పేలుడు పదార్థాలతో పార్లమెంట్ ఛాంబర్స్ ప్రధాన ద్వారం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.పార్లమెంట్ భవనంలోకి వెళ్లాలనేది ఉగ్రవాదుల టార్గెట్‌గా ఉన్నింది. లోపల మంత్రులను ఎంపీలను మట్టుబెట్టాలనే పక్కా ప్లాన్‌తో ఉగ్రవాదులు అటాక్స్‌ను ప్లాన్ చేశారు. ఈ ఘనలో ప్రాణనష్టం తక్కువే అయినప్పటికీ దేశ ప్రజాస్వామ్యం పై చేసిన దాడిగా ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఇక ఘటనపై వెంటనే విచారణ ప్రారంభించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు అఫ్జల్ గురు, గిలానీ, షౌకత్ హుస్సేన్ , నవజ్యోత్ సంధూలకు సంబంధం ఉందని తేల్చేసింది.

దాడి తర్వాత ఏం జరిగింది : పార్లమెంట్ భవనం పై ఉగ్రదాడి తర్వాత 72 గంటల్లోపే ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కేసును చేధించింది.దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులు పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించి వీరంతా లష్కరే తోయిబా, జైషే మొహ్మద్ ఉగ్రవాదులుగా తేల్చేసింది. జేకేఎల్ఎఫ్ ఉగ్రవాది మొహ్మద్ అఫ్జల్ గురు,అతని బంధువు షౌకత్ హుస్సేన్ గురు, షౌకత్ భార్య అఫ్సాన్ గురు, ఢిల్లీ యూనివర్శిటీలో అరబిక్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఎస్ఏఆర్ గిలానీలకు సంబంధం ఉందని విచారణలో తేలగా వారిని పోలీసులు అరెస్టు చేశారు.షౌకత్ భార్య అఫ్సాన్ గురు నిర్దోషి అని తేలగా, గిలానీకి మరణశిక్ష వేసింది కోర్టు. అయితే 2005లో గిలానీని నిర్దోషిగా పేర్కొంటూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. మరో నిందితుడు అఫ్జల్ గురు 2013లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉరితీయబడ్డాడు.

పార్లమెంట్ భవనంపై దాడికి సంబంధించి వచ్చిన రియాక్షన్స్ ఒక్క ఢిల్లీ వరకే పరిమితం కాలేదు. దాదాపుగా భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగే వరకు పరిస్థితి వెళ్లింది. భారత్ పాక్ సరిహద్దులో దాదాపుగా 5 లక్షల మంది జవాన్లను ఇండియన్ ఆర్మీ రంగంలోకి దింపింది.అణుయుద్ధం జరిగేలా ప్రపంచదేశాలకు సంకేతాలు అందాయి.ఇక పాకిస్తాన్‌లోని భారత హైకమిషనర్‌ను వెనక్కి రప్పించడంతో పాటు పాకిస్తాన్‌కు విమానాయాన సేవలను భారత ప్రభుత్వం నిలిపివేసింది. సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ జోక్యం చేసుకుని రెండు దేశాల మధ్య శాంతివాతావరణం నెలకొనేలా కృషి చేశారు.ఇక ప్రపంచ దేశాల నుంచి అప్పటి పాక్ అధ్యక్షుడు ముషారఫ్‌పై ఒత్తిడి పెరగడంతో ఐదు జీహాదీ సంస్థలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో జైషే మొహ్మద్, లష్కరే తోయిబా సంస్థలు కూడా ఉన్నాయి. తన భూభాగం నుంచి ఎలాంటి ఉగ్రకార్యకలాపాలకు అనుమతి లేదని నాడు అధ్యక్షుడి హోదాలో ముష్రాఫ్ ప్రకటించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications