కోవీషీల్డ్-కోవ్యాగ్జిన్... ఈ రెండు వ్యాక్సిన్ల మధ్య తేడా ఇదే... ఎలా పనిచేస్తాయో తెలుసా...
భారత్‌లో కరోనా నివారణలో భాగంగా ఎమర్జెన్సీ వ్యాక్సిన్లకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్ తయారుచేసిన కోవ్యాగ్జిన్,సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారుచేసిన కోవీషీల్డ్‌లకు అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. అయితే ఈ రెండింటిలో ఏ వ్యాక్సిన్ బెటర్ అన్న దానిపై జనాల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు ఈ రెండు వ్యాక్సిన్ల మధ్య వున్న ప్రధాన తేడాలను ఒకసారి పరిశీలిద్దాం...
Recommended Video

కోవీషీల్డ్ ఇలా పనిచేస్తుంది...
భారత్‌లో కోవీషీల్డ్‌గా పరిగణిస్తున్న ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను గ్లోబల్‌గా AZD1222గా వ్యవహరిస్తున్నారు. జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన వైరస్‌లతో దీన్ని అభివృద్ది చేశారు. ఈ వైరస్‌లను అడెనోవైరల్ వెక్టార్స్ అని కూడా పిలుస్తారు. శరీరంలోకి వైరస్ ప్రవేశించిందని అంతర్గత వ్యవస్థలను నమ్మింపజేయడంలో ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీంతో వైరస్‌తో పోరాడేందుకు శరీరంలోని కణాలు వాటి చుట్టూ స్పైక్ ప్రోటీన్లను ఏర్పరుచుకుంటాయి. ఈ టీకాలో చింపాంజీ అడెనోవైరస్ బలహీనమైన, జన్యుపరంగా మార్పు చెందిన రూపంలో ఉంటుంది కాబట్టి అది మనుషులకు సోకదు. కానీ స్పైక్ ప్రోటీన్ల ఉత్పత్తిలో కీలకంగా వ్యవహరిస్తుంది. దీంతో శరీరం కరోనా వైరస్‌తో పోరాడేందుకు అవసరమైన యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తుంది.

కోవ్యాగ్జిన్ ఇలా పనిచేస్తుంది...
కోవిడ్ -19కు కారణమయ్యే SARS-CoV-2 క్రియా రహిత అణువుతో కోవ్యాగ్జిన్‌ను అభివృద్ధి చేశారు. ఈ ఏడాది మే నెలలో హైదరాబాద్‌కి చెందిన ఓ కరోనా అసింప్టమాటిక్ పేషెంట్ నమూనాల నుంచి ఈ స్ట్రెయిన్‌ను వేరు చేసి దాన్ని వ్యాక్సిన్ తయారీ కోసం వాడారు. వ్యాక్సిన్ ద్వారా ఈ క్రియా రహిత స్ట్రెయిన్‌ను శరీరంలోకి పంపించినప్పుడు యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. వైరస్‌కు సంబంధించిన ఆ స్ట్రెయిన్ క్రియా రహితంగా ఉంటుంది కాబట్టి శరీరానికి ఎటువంటి హానీ జరగదు. ఆ స్ట్రెయిన్ క్రియా రహితంగా ఉన్నప్పటికీ శరీరంలోని రోగ నిరోధక కణాలు ఆ వైరస్‌ను గుర్తించి యాంటీ బాడీలను ఉత్పత్తి చేసుకుంటాయి.

రెండూ సురక్షితమే...
ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కోవీషీల్డ్ భారత్‌లో 70.4శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. భారత్ బయోటెక్ కోవ్యాగ్జిన్ కూడా పూర్తి సురక్షితంగా,ప్రభావవంతంగా పనిచేస్తుందని నిర్దారణ అయినప్పటికీ.. దీనికి సంబంధించి మరింత డేటాను విశ్లేషించాల్సి ఉంది. ప్రస్తుతం 23వేల మంది వాలంటీర్లపై కోవ్యాగ్జిన్ మూడో విడత క్లినికల్ ట్రయల్స్ చేపడుతున్నారు. భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ... తమ సంస్థ తయారుచేసిన కోవ్యాగ్జిన్ కరోనా మ్యుటేషన్లను కూడా ఎదుర్కోగలదని చెప్పారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్ కూడా కరోనా మ్యుటేషన్లను ఎదుర్కోగలదని ఆస్ట్రాజెనెకా సీఈవో తెలిపారు.

రెండు డోసుల విధానంలో...
కోవీషీల్డ్,కోవ్యాగ్జిన్ రెండింటినీ సాధారణ ఉష్ణోగ్రతల వద్దే నిల్వ చేయవచ్చు. అదే ఫైజర్ లాంటి వ్యాక్సిన్లకు మైనస్ 70 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు అవసరం. కాబట్టి భారత్‌లో అలాంటి వ్యాక్సిన్లను నిల్వ చేయడం,సప్లై చేయడం రెండూ కష్టమే. అందుకే డీసీజీఐ కోవీషీల్డ్,కోవ్యాగ్జిన్‌లకు అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. ఈ రెండింటిని రెండు డోసుల విధానంలో పేషెంట్లకు ఇస్తారు. అయితే డోసుకు,డోసుకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలన్నది ఆ సంస్థలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications