"కావేరి నీళ్లు తమిళనాడుకు ఇవ్వలేం"
బెంగళూరు: కావేరి ట్రిబ్యునల్ నిర్ణయించిన నీటిని ఇప్పట్లో తమిళనాడుకు వదిలిపెట్టడానికి వీలు కాదని కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ తమిళనాడు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన తమిళనాడు ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాశారు.
కావేరి నీటి పంపిణి విషయంలో కావేరి ట్రిబ్యునల్ ఒక నిర్ణయం తీసుకుంది. సంవత్సరానికి 192 టీఎంసీల నీటిని తమిళనాడుకు వదిలిపెట్టాలని కర్ణాటకకు సూచించింది. కేఆర్ఎస్ రిజర్వాయర్ లో నీరు లేదని, ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కర్ణాటక అంటున్నది.

ఇటీవల మండ్య జిల్లాలో రైతులు అధిక సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సందర్బంలో తమిళనాడు ప్రభుత్వానికి నీరు వదిలిపెడితే లేని పోని సమస్యలు వస్తాయని కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్లి కావేరి నీటి విషయంపై రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది.
అయితే ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనే విషయం వేచిచూడాలి. తమకు రావలసి నీటి వాటా విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి పరిస్థితో రాజీపడదనే విషయం గతంలో అనేక సార్లు వెలుగు చూసింది. ఇప్పుడు మళ్లి కావేరి ట్రిబ్యునల్ ను ఆశ్రయించడానికి అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications