రైల్వేస్టేషన్ లో పేలుడు, చెయ్యి కట్, ఎమ్మెల్యే పేరుతో బాక్స్, అమరావతి ఎక్స్ ప్రెస్!

బెంగళూరు: కర్ణాటకలోని హుబ్బళి రైల్వే స్టేషన్ లో సోమవారం మద్యాహ్నం పేలుడు సంభవించి ఓ వక్తి చెయ్య తెగిపోయింది. కర్ణాటకలోని ఖానాపుర్ ఎమ్మెల్యే అంజలి నింబాళ్కర్ పేరుతో వచ్చిన బాక్స్ ను తీసి చూస్తుండగా ఒక్కసారిగా పేలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. అయితే ఖానాపూర్ ఎమ్మెల్యే అంజలీ నింబార్కర్ పేరుతో బాక్స్ రాలేదని, కోల్లాపుర్ ఎమ్మెల్యే పేరుతో పార్శిల్ బాక్స్ వచ్చిందని వాదనలు వినిపిస్తున్నాయి.

అమరావతి ఎక్స్ ప్రెస్

అమరావతి ఎక్స్ ప్రెస్

హుబ్బళి రైల్వేస్టేషన్ లో సోమవారం అమరావతి ఎక్స్ ప్రెస్ రైలులో ఉన్న అనుమానాస్పదంగా బాక్స్ కనపడటంతో ప్రయాణికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న రైల్వేస్టేషన్ లోని ఆర్ పీఎఫ్ పోలీసులు రైల్వేస్టేషన్ లో పరిశీలించారు.

పాపం అమాయకుడు

పాపం అమాయకుడు

రైల్వేస్టేషన్ లో ప్రయాణికులకు టిఫిన్ విక్రయించే హుసేనాబాబా మకానవాలే అక్కడే ఉండటంతో అతనిని ఆర్ పీఎఫ్ పోలీసులు పిలిచారు. బాక్స్ లో ఏముందో తీసి చూడాలని ఆర్ పీఎఫ్ పోలీసులు హుసేనాబాబా మకానవాలేకి చెప్పారు. హుసేనాబాబా బాక్స్ తీసి చూస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలిపోయింది. ఇదే ప్రమాదంలో హుసేనాబాబా చెయ్యి తెగిపోవడంతో వెంటనే భాదితుడిని ఆసుపత్రికి తరలించారు.

నో బీజేపీ, నో శివసేన

నో బీజేపీ, నో శివసేన

అనుమానాస్పద బాక్స్ మీద నో బీజేపీ, నో కాంగ్రెస్, ఓన్లీ శివసేన అని రాసి ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని పోలీసులు అన్నారు. అనుమానాస్పద బాక్స్ అక్కడకు తీసుకువచ్చిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మహారాష్ట్ర ఎన్నికల దెబ్బ ?

మహారాష్ట్ర ఎన్నికల దెబ్బ ?

పేలుడు జరిగిన బాక్స్ మీద బీజేపీ, కాంగ్రెస్, శివసేన పేర్లు ఉండటంతో అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలో శాసన సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజే పేలుడు జరగడంతో ఆ రాష్ట్రానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఉగ్రవాదులతో జాగ్రత్త

ఉగ్రవాదులతో జాగ్రత్త

బస్ స్టాప్ లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. ఇదే సమయంలో నిత్యం రద్దీగా ఉండే హుబ్బళి రైల్వేస్టేషన్ లో పేలుడు జరగడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

అనుమానాస్పద వ్యక్తులు !

అనుమానాస్పద వ్యక్తులు !

హుబ్బళి రైల్వేస్టేషన్ తో పాటు ఇతర రైల్వేస్టేషన్లలో పోలీసులు అనుమానాదస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను విచారణ చేస్తున్నారు. హుబ్బళి రైల్వేస్టేషన్ లో పేలుడు జరగడానికి కారణం అయిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హుబ్బళి రైల్వేస్టేషన్ లో పేలుడు జరగడంతో అన్ని రైల్వేస్టేషన్లలో నిఘా పెంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+