కూతుర్ని చంపి బైక్ కు శవాన్ని కట్టేసి రైల్వే ట్రాక్ మీద ?, ఏం జరిగింది ?
పంజాబ్/ అమృత్‌సర్: పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా ముచల్ గ్రామంలో 20 ఏళ్ల యువతిని కన్న తండ్రే హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. అలాగే కూతురి శవాన్ని బైక్‌కు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లి రైలు పట్టాలపై ఆ శవాన్ని పడేసి కసి తీర్చుకున్నాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అందరూ చూస్తున్న సమయంలో కన్నతండ్రి ఆమె కూతురి శవాన్ని తీసుకెళ్లి రైలు పట్టాల మీద విసిరేశాడని పోలీసులు తెలిపారు.
దల్బీర్ సింగ్ అనే నిందితుడు తన కుమార్తెపై రెండు రోజులుగా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడని, కోపంతోనే ఆమెను చంపేశాడని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. బుధవారం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిన కూతురు మరుసటి రోజు మద్యాహ్నం ఇంటికి తిరిగి వెళ్లింది. కూతురు చెప్పాపెట్టకుండా రెండు రోజులు బయట తిరిగి రావడంతో ఆ కోపంతో తండ్రి ఆమెను హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

నిందితుడు దల్పీర్ సింగ్ తన కుటుంబ సభ్యులను కూడా ఇంట్లో బంధించి చంపేస్తానని బెదిరించినట్లు మాకు సమాచారం అందిందని, భయంతో వారు ఇంటి నుంచి బయటకు రాలేకపోయారని పోలీసు అధికారి ఒకరు స్థానిక మీడియాకు తెలిపారు. నా మనుమరాలు ఇంటి నుండి వెళ్లిపోయింది, మరుసటి రోజు ఆమె ఇంటికి తిరిగి వచ్చిందని, ఆమె తిరిగి రాగానే, ఆమె తండ్రి కోపంతో ఆమెను చంపాడని బాధితురాలి అమ్మమ్మ పోలీసులకు చెప్పింది.
దల్బీర్ సింగ్ నిహాంగ్ సిక్కు మతానికి చెందిన వాడు, అతను కూలీగా పనిచేస్తున్నాడని తారక్కా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అవతార్ సింగ్ తెలిపారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. ఇది ఆవేశంతో చేసిన నేరం అనిపిస్తోందని, ఆ యువతి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని, ఆమెను హత్య చేసిన అనంతరం నిందితుడు అతని కుమార్తె మృతదేహాన్ని బైక్‌కు కట్టేసి ఈడ్చుకెళ్లడం కలకలం రేపిందని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications