కూతురి వెంట తిరుగుతున్న డెలివరీబాయ్, పెళ్లి విషయం మాట్లాడాలని పిలిపించి ?
బెంగళూరు: కూతుర్ని చదివిస్తున్న వ్యక్తి ఆమె బాగా చదువుకోవాలని ఆశపడుతున్నాడు. పగలు, రాత్రి కష్టపడుతున్న వ్యక్తి అతని భార్య, పిల్లలకు ఏలోటు రానివ్వకుండా చూసుకుంటున్నాడు. కూతురు మేజర్ కాకపోయినా ఆమె వెంట ఓ యువకుడు తిరుగుతున్నాడని తండ్రికి తెలిసింది. ఈ విషయం గురించి కూతుర్ని ఆమె తండ్రి ప్రశ్నించాడు. వాడు తన వెంటపడుతున్నాడని, నేను అతన్ని ప్రేమించలేదని, తనను అతను వేధిస్తున్నాడని కూతురు ఆమె తండ్రికి చెప్పింది. అంతే అమ్మాయి తండ్రి పవర్ ఫుల్ స్కెచ్ వేశాడు.
బెంగళూరు సిటీలోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్రమణ్యపురలో మంజునాథ్ అలియాస్ మంజు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మంజునాథ్ కు 17 ఏళ్ల కుమార్తె ఉంది. డ్రైవర్ గా పని చేస్తున్న మంజునాథ్ అతని భార్య, పిల్లలను బాగా చూసుకుంటున్నాడు. మంజునాథ్ పిల్లలు చదువుకుంటున్నారు. మంజునాథ్ కుమార్తె కాలేజ్ కు వెళ్లి వస్తోంది.

అశోక్ నగర్ సమీపంలోని వినాయక నగర్ లో డేవిడ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. డెలివరీ బాయ్ గా పని చేస్తున్న డేవిడ్ రోజూ బైక్ లో తిరుగుతూ అమ్మాయిల వెంటపడుతున్నాడని సమాచారం. మంజునాథ్ మైనర్ కూతురి వెంటపడిన డేవిడ్ తనను ప్రేమించాలని ఆమెను వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. తన కుమార్తె వెంట డేవిడ్ తిరుగుతున్నాడని మంజునాథ్ కు తెలిసింది.
తాను డేవిడ్ ను ప్రేమించలేదని, అతనే తనవెంట తిరుగుతూ తనను ప్రేమించాలని టార్చర్ పెడుతున్నాడని కూతురు మంజునాథ్ కు చెప్పింది. డేవిడ్ ను పిలిచిన మంజునాథ్ తన కూతురు వెంటతిరిగితే నీ అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చాడు. మంజునాథ్ వార్నింగ్ ఇచ్చినా ఏమాత్రం పట్టించుకోని డెలవరీ బాయ్ అతని కూతురి వెంట తిరుగుతూనే ఉన్నాడు.

ఇదే విషయంలో మంజునాథ్. డేవిడ్ ల మధ్య వారం రోజుల క్రితం పెద్ద గొడవ కూడా జరిగింది. అయినా డేవిడ్ మాత్రం అతని పద్దతి మార్చుకోలేదు. సోమవారం రాత్రి డేవిడ్ కు ఫోన్ చేసిన మంజునాథ్ తన కూతురి పెళ్లి విషయం మాట్లాడాలని, నువ్వు సుబ్బన్న గార్డెన్ దగ్గరకు రావాలని చెప్పాడు. ప్రియురాలి పెళ్లి విషయం మాట్లాడటానికి ఆమె తండ్రి పిలవడంతో డేవిడ్ అక్కడికి వెళ్లాడు. తరువాత కూడా మంజునాథ్, డేవిడ్ ల మధ్య పెద్ద గొడవ జరిగింది.
ఆ సందర్బంలో ముందుగా వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకున్న మంజునాథ్ నా కూతురి వెంట తిరుగుతావా అంటూ డేవిడ్ ను ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. కత్తిపోట్లు ఎక్కువ పడటంతో డేవిడ్ కుప్పకూలిపోయాడు. ఆ సందర్బంలో సమీపంలోని బండరాయి ఎత్తుకున్న మంజునాథ్ కిందపడిపోయిన డేవిడ్ తల మీద ఎత్తి వెయడంతో అతను స్పాట్ లో చనిపోయాడు. విషయం తెలుసుకున్న అశోక్ నగర్ పోలీసులు డేవిడ్ శవాన్ని ఆసుపత్రికి తరలించి హత్య చేసిన మంజునాథ్ ను అరెస్టు చేసి కేసు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications