వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జో బైడెన్-షీ జిన్‌పింగ్‌ల మధ్య ముగిసిన తొలి సమావేశం -Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
షీ జిన్‌పింగ్‌తో జో బైడెన్ విర్చువల్ సమావేశం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన మొదటి వర్చువల్ సమావేశం ముగిసిందని చైనా అధికార మీడియా చెప్పింది.

రెండు దేశాల మధ్య తైవాన్, హాంకాంగ్, మానవ హక్కులు వంటి అంశాలలో దూరం పెరిగిన ఉన్న నేపథ్యంలో ఇద్దరి మధ్య ఈ సమావేశం జరిగింది.

తమ మధ్య శత్రుత్వం బహిరంగ వివాదంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెండు దేశాలపైనా ఉందని జో బైడెన్ అన్నారు.

జనవరిలో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంగళవారం ఇద్దరు నేతల మధ్య జరిగిన చర్చలు అత్యంత కీలకమైనవిగా నిలిచాయి.

ఈ చర్చలను నిర్మాణాత్మకంగా, ఫలవంతమైనవిగా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ వర్ణించారు. పరస్పర అవగాహన పెంపొందించడానికి ఇవి సహకరించాయని చెప్పారు.

షీ జిన్‌పింగ్‌, జో బైడెన్

సమావేశంలో ఏం మాట్లాడారు

అమెరికా, చైనా అధ్యక్షుల ఈ సమావేశం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడంతో మొదలైంది.

"పాత స్నేహితుడు బైడెన్‌ను చూడడం సంతోషంగా ఉంది" అని షీ జిన్‌పింగ్ అన్నారు.

"మీరు, నేను ఎప్పుడూ అంత అధికారికంగా మాట్లాడుకోకపోయినా, బహుశా నేను మరింత అధికారికంగా వీటిని ప్రారంభించాలేమో. మనిద్దరం ఎప్పుడూ చాలా నిజాయితీగా, స్పష్టంగా చర్చలు జరిపాం. అవతలి వారు ఏమనుకుంటారో అని ఎప్పుడూ దూరం జరగలేదు" అని బైడెన్ అన్నారని రాయిటర్స్ చెప్పింది.

"రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపరుచుకోవాలస్సిన అవసరం ఉంది. సవాళ్లను మనం కలిసి ఎదుర్కోవాలి. వాతావరణ మార్పులు, కోవిడ్-19 లాంటి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోడానికి వీలుగా చైనా-అమెరికా సంబంధాలు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది" అని షీ జిన్ పింగ్ అన్నట్లు చైనా అధికార మీడియా పేర్కొంది.

వారం క్రితం గ్లాస్గోలో జరిగిన చర్చల్లో వాతావరణ మార్పుల సమస్యపై అమెరికా-చైనా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

"మానవాళి ఒక భౌగోళిక గ్రామంలో నివసిస్తోంది. మనం కలిసి ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటున్నాం. చైనా, అమెరికా కమ్యూనికేషన్, సహకారం పెపొందించుకోవాల్సిన అవసరం ఉంది" అని అందులో షీ జిన్‌పింగ్ చెప్పారు.

"చైనా-అమెరికా సంబంధాలను సానుకూల దిశగా ముందుకు తీసుకెళ్లేలా మీతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మిస్టర్ ప్రెసిడెంట్" అని ఆయన అప్పుడు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The first meeting between Joe Biden and Xi Jinping ended -Newsreel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X