బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: తొలి దశ పోలింగ్ (వీడియో)
పాట్నా: బీహార్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యింది. బీహార్ లోని 10 జిల్లాలలోని 49 అసెంబ్లీ స్థానాలలో 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 54 మంది మహిళలు ఉన్నారు. ఈ అభ్యర్థులు వారి తలరాతను ప్రజల చేతిలో పెట్టారు.
తొలి దశ పోలింగ్ సందర్బంగా కట్టుదిట్టమైన భద్రతా ఎర్పాట్లు చేశామని అడిషనల్ చీఫ్ ఎలక్ట్రోలర్ అధికారి ఆర్. లక్ష్మణన్ చెప్పారు. ఈ 10 జిల్లాలలో మొత్తం 1,35,72,339 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, అందు కోసం మొత్తం 13,212 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు.
అనేక ప్రాంతాలలో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువుగా ఉన్న ప్రాంతాలలో సాయంత్రం 3 గంటలకు, కొన్ని చోట్ల నాలుగు గంటలకు పోలింగ్ నిలిపి వేస్తున్నామని ఆయన వివరించారు.

బీహార్ శాసనసభ ఎన్నికలు అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5వ తేది వరకు ఐదు దశలలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 8వ తేదిన ఓట్ల లెక్కింపులో ఎవరి జాతకం ఏమిటి అనే విషయం బయటపడనుంది.












Click it and Unblock the Notifications