బుద్దుడి బంగారు పాత్ర చోరీ, ఏడేళ్లు జైలు
కంబోడియా: బౌద్ధ మందిరంలో బంగారు పాత్ర చోరీ చేసిన ఐదు మందిని జైలుకు పంపించారు. కంబోడియా ప్రత్యేక న్యాయస్థానం నిందితులకు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. స్థానిక మీడియా తెలిపిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి.
కంబోడియాలోని ఔడంగ్ పర్వతంపై ప్రసిద్ధి చెందిన బౌద్ద మందిరం ఉంది. ఈ మందిరంలో బుద్ధుని పురాతన బంగారు పాత్ర ఉంది. ఇక్కడ పలువురు సెక్యూరిటి సిబ్బందిగా ఉద్యోగాలు చేస్తున్నారు. బౌద్ద మందిరానికి కట్టుదిట్టమైన భద్రత ఉంది.

2013 డిసెంబర్ నెలలో మందిరంలో ఉన్న బుద్దుడి పురాతన బంగారు పాత్ర చోరీ అయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేశారు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది మీద పోలీసులకు అనుమానం వచ్చింది.
చీఫ్ సెక్యూరిటి అధికారితో పాటు నలుగురు సెక్యూరిటి సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఆ ఐదు మంది బంగారు పాత్రను చోరీ చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఒక్కోక్కరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications