Hyderabad: హైదరాబాద్ రావాల్సిన విమానం జైపూర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్..

ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తోన్న విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. శుక్రవారం ఉదయం విస్తారా ఎయిర్ లైన్స్ చెందిన విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తోంది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఫ్లైట్ మళ్లించినట్లు తెలిసింది. విమానం నంబర్ యూకే-829 ఉదయం 8 గంటల 30 నిమిషాలకు జైపూర్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని విస్తార ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ విమానం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ రావాల్సి ఉందని పేర్కొంది. విమానంలో ఉన్న ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ చేసినట్లు పేర్కొంది.

అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని జైపూర్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా విమానాలకు బాంబు బెదిరింపు వచ్చాయి. దీనిపై కేంద్రం సీరియస్ గా ఉంది. అయినప్పటికీ బెదిరింపులు ఆగడం లేదు. ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ లైన్స్ బాంబు బెదిరింపుల ఎక్కువగా వస్తున్నాయి. గురువారం కూడా 90కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఒక్క రోజు ఇన్ని బెదిరింపులు రావడంపై ఎయిర్ లైన్స్, ప్రయాణికులు ఆందోళనగా ఉన్నారు.

The flight from Delhi to Hyderabad made an emergency landing in Jaipur

గురువారం ఎయిర్ ఇండియా, ఆకాశా ఎయిర్, ఇండిగో, విస్తారా, అలియన్స్ ఎయిర్, స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందులో ఆకాశా ఎయిర్ లైన్స్ కు చెందిన25 విమానాలకు బాంబు బెదిరింపు రాగా.. ఎయిర్ ఇండియాకు చెందిన 20 విమానాలకప బెదిరింపులు వచ్చాయి. వీటితో , ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, అలియన్స్ ఎయిర్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా గత వారం, పది రోజుల్లో విమానాలకు 250 బెదిరింపులు వచ్చాయి.

ఈ బాంబు బెదిరింపులు ఎక్కువగా సోషల్ మీడియా నుంచి వస్తున్నాయి. దీంతో కేంద్రం ఎక్స్, మెటాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పనులు చేసే వారికి జీవిత ఖైదు విధించేలా చట్ట సవరణ చేస్తామని హెచ్చరించింది. వారిని నో ఫ్లై జాబితాలో చేర్చుతామని హెచ్చరించింది. అయినప్పటికీ బాంబు బెదిరింపులు ఆగడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+