నీరవ్ మోడీ, విజయ్ మాల్యాలకు గట్టి షాక్ ఇవ్వనున్నకేంద్రం!
న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాలు ఎగవేసి లేదంటే బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయే బడాబాబులకు ప్రభుత్వం గట్టి షాక్ ఇవ్వబోతోంది. ఇలాంటి ఆర్థిక నేరగాళ్లకు వ్యతిరేకంగా కేంద్రం ఓ కఠిన చట్టాన్ని తీసుకొస్తోంది. 'ది ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్' పేరుతో దీన్ని త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ డ్రాఫ్ట్‌ను గత సెప్టెంబర్‌లోనే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. పీఎన్‌బీ స్కాం నేపథ్యంలో ఈ బిల్లును పాస్ చేయాలని మోడీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మార్చి 6 నుంచి జరుగబోతున్న తదుపరి బడ్జెట్ సెషన్లలో దీన్ని ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

ఏమిటీ కఠిన చట్టం?
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ ‘ది ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్' చట్టం ద్వారా నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వారు బ్యాంకులకు భారీగా కన్నం వేసి విదేశాలకు పారిపోతే, వారి ఆస్తులను అమ్మేయొచ్చు. స్పెషల్ కోర్టు ద్వారా అన్ని బకాయిలను వెంటనే రికవరీ చేసుకునే వీలును ఈ బిల్లు కల్పిస్తుంది. నిందితులు విదేశాలకు పారిపోయినప్పటికీ, వారు ఏం దాచలేరని కచ్చితంగా దేశీయంగా వారికున్న అన్ని ఆస్తులను విక్రయించే అధికారాన్ని ప్రభుత్వానికి ఈ బిల్లు కట్టబెడుతుంది.
Recommended Video


నిందితుల ఆస్తులు అమ్మేయొచ్చు...
ఒక్కసారి ఈ బిల్లు ఆమోదిస్తే.. దర్యాప్తు సంస్థ విదేశాలకు పారిపోయిన రుణ ఎగవేతదారులు, బ్యాంకు మోసాలకు పాల్పడిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను ఎలాంటి దాడులు చేయకుండానే స్వాధీనం చేసుకోవచ్చు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా, ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కూడా ఈ చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. గత సెప్టెంబర్‌లోనే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ డ్రాఫ్ట్‌ను ఆమోదించింది. పీఎన్‌బీ స్కాం నేపథ్యంలో ఈ బిల్లును పాస్ చేయాలని మోడీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మార్చి 6 నుంచి జరుగబోతున్న తదుపరి బడ్జెట్ సెషన్లలో దీన్ని ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

ఎవరు అఫెండర్ అవుతారంటే...
‘ది ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్' చట్టం ఎవరికి వర్తిస్తుందంటే... ఉద్దేశ పూర్వకంగా రుణాన్ని ఎగవేసిన వారు, మోసం, ఫోర్జరీ, ఎలక్ట్రానిక్ రికార్డుల తప్పుడు డాక్యుమెంట్లు, సుంకాలు ఎగవేసిన వారు, అలాగే డిపాజిట్లు తిరిగి చెల్లించని వ్యక్తులు, సంస్థలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఏ వ్యక్తి అయినా, లేదా ఏ సంస్థ అయినా ఈ నేరాల కింద అరెస్ట్ వారెంట్ జారీ అయి, అతను లేక ఆమె క్రిమినల్ ప్రొసిక్యూషన్ తప్పించుకోవడానికి భారత్‌ను వీడి వెళ్లితే అతడ్ని లేదా ఆమెను ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్‌గా గుర్తిస్తారు.

నీరవ్, మాల్యా లాంటి వాళ్ల కోసమే...
పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు విజయ్ మాల్యా కూడా ఇలానే బ్యాంకులకు రూ.9000 కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేశాడు. ఇలాంటి వ్యక్తులపై గట్టి చర్యలు తీసుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన చట్టాన్ని తీసుకొస్తోంది. ఇక అసాధారణ లావాదేవీలను గుర్తించి, అథారిటీలను అలర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా బ్యాంకింగ్ రెగ్యులేటర్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌దే. ఎగవేత కంపెనీల వ్యాపార నమూనాల మార్పులపై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు దృష్టిసారించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications