రాజ్యసభ ఎన్నికలు, క్రాస్ ఓటింగ్, అహ్మద్ పటేల్ కు ఓటు వెయ్యలేదు, కాంగ్రెస్ రెబల్స్!
అహమ్మదాబాద్: గుజరాత్ లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ కు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చుక్కలు చూపిస్తున్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరుగుతోందని స్పష్టంగా వెలుగు చూసింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు శంకర్ సింగ్ వాఘేలా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు.
Congress hadn't been listening to us for a year. We have voted for Balwantsinh Rajput: Dharmendra Jadeja, Congress #RajyaSabhaPolls #Gujarat pic.twitter.com/7SRFILADE6
— ANI (@ANI_news) August 8, 2017
రాజ్యసభ ఎన్నికల్లో తాను అహ్మద్ పటేట్ కు ఓటు వెయ్యలేదని బహిరంగంగా మీడియాకు చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ పటేల్ గెలవలేరని శంకర్ సింగ్ వాఘేలా జోస్యం చెప్పారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు గెలుస్తారని వాఘేలా ధీమా వ్యక్తం చేశారు.
శంకర్ సింగ్ వాఘేలాతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడు మంది ఎమ్మెల్యేలు తాము అహ్మద్ పటేల్ కు ఓటు వెయ్యలేదని బహిరంగంగానే చెప్పారు. ఈ సమయంలో రాజ్యసభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అనే విషయం ఆసక్తికరంగా మారింది. శంకర్ సింగ్ వాఘేలాతో సహ ఏడు మంది కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు బహిరంగంగా తాము ఆపార్టీ అభ్యర్థికి ఓటు వెయ్యలేదని చెప్పడంతో అహ్మద్ పటేల్ ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications