విద్యార్థిని మీద యాసిడ్ పోసిన హెడ్ మాస్టర్, ఏం పోయేకాలం వచ్చిందని తల్లి !
బెంగళూరు: టాయిలెట్ సరిగా శుభ్రం చేయలేదని ఆగ్రహించిన ప్రధానోపాధ్యాయుడు ప్రభుత్వ స్కూల్ లో చదువుతున్న విద్యార్థినిపై యాసిడ్ పోసిన షాకింగ్ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని జోడిచిక్కేనహళ్లిలో చోటుచేసుకుంది. చిత్రదుర్గ జిల్లా జోడిచిక్కేనహళ్లిలోని ప్రభుత్వ సీనియర్ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్డి శుభ్రం చేయాలని రెండవ తరగతి చదువుతున్న బాలికలకు ప్రధాన ఉపాధ్యాయుడు రంగస్వామి సూచించినట్లు సమాచారం.
తెలిసితెలీని వయసులో ఉన్న ఆ విద్యార్థి టాయిలెట్‌ను సరిగా శుభ్రం చేయకపోవడంతో ఆగ్రహించిన ప్రధాన ఉపాధ్యాయుడు రంగస్వామి మరుగుదొడ్డి శుభ్రం చేసేందుకు తెచ్చిన యాసిడ్‌ను విద్యార్థిపై పోసినట్లు సమాచారం. మరుగుదొడ్డి శుభ్రం చేయడానికి ఉపయోగించిన యాసిడ్‌ను చల్లడం వల్ల విద్యార్థిని వీపుపై తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చిత్రదుర్గా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై చిత్రదుర్గ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైయ్యింది.

కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాల్లో కొందరు ఉపాధ్యాయుల తిక్క చేష్టల కారణంగా చాలా మంది టీచర్లకు చెడ్డపేరు వస్తోందని సాటి టీచర్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందిలే, మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని కొందరు టీచర్ల ఆడింది ఆటగా పాడిందిపాటగా తయారైయ్యిందని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ విద్యార్థులకు చక్కగా పాఠాలు చెప్పాల్సిన హెడ్ మాస్టర్ రంగస్వాయి ఏడు ఏళ్ల వయసు ఉన్న బాలికలతో బాత్ రూమ్ లు, టాయిలెట్లు శుభ్రం చేయించడం మొదటి నేరం,

అంతేకాకుండా బాత్ రూమ్ లు శుభ్రంగా లేవని రెచ్చిపోయిన హెడ్ మాస్టర్ రంగస్వామి ఆ బాలిక మీద యాసిడ్ పోయ్యడం క్షమించరాని నేరం అని, అతన్ని శాస్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని, వెంటనే ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపించాలని విద్యార్థుల కుటుంబ సభ్యుడు డిమాండ్ చేస్తున్నారు. చిత్రదుర్గ జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications