పహల్గాం దాడి ఉగ్రవాదుల ఇళ్లపై సైన్యం మెరుపు దాడి, పేల్చివేత..!!
భారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నియంత్రణ రేఖ వద్ద పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత గస్తీ దళాల మీద కాల్పులకు తెగ బడింది. ఇండియన్ ఆర్మీ తిప్పి కొట్టింది. ఉగ్రవాదుల కోసం సైన్యం భారీ స్థాయిలో కూంబింగ్ చేస్తున్నారు. దాడిలో పాల్గొన్న వారిగా భావిస్తున్న ఉగ్రవాది ఇంటిని సైన్యం పేల్చి వేసింది. రెండు దేశాల నిర్ణయాలతో బోర్డర్ లో ఉద్రిక్తత పెరుగుతోంది. ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. అటు కఠినంగా దౌత్య పరమైన నిర్ణయాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ఆర్మీ చీఫ్ పహల్గాం చేరుకుంటున్నారు.
ఉగ్రవాది ఇంటి పేల్చివేత
భారత్ - పాక్ తీసుకున్న దౌత్య పరమైన నిర్ణయాలతో ఉత్కంఠ పెరుగుతోంది. నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పులకు దిగింది. భారత్ సైన్యం ధీటుగా స్పందించింది. అటు జమ్మూ కాశ్మీర్‌లోని బందీపొరా జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పులు ఎన్‌కౌంటర్ కు దారి తీశాయి. కుల్నార్ బాజిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచా రం మేరకు భద్రతా సిబ్బంది కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ సమయంలోనే ఆ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలను చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైనికులు అంతే ధీటుగా ప్రతీకార చర్యకు దిగారు. ఇరువర్గాల నడుమ పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. మరో వైపు పుహల్గాం దాడిలో ఒకడిగా భావిస్తున్న ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇంటిని సైన్యం పేల్చేసింది.

పాక్ కవ్వింపు చర్యలు
మరో వైపు జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలోని ట్రాల్‌లోనూ జవాన్లు భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మోంఘమా ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తుండగా సమీపంలో అనుమానా స్పద వస్తువులు ఉన్నట్లు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. రక్షణాత్మక ప్రదేశాలకు చేరుకు నేసరికే ఒక ఇంట్లో నుంచి భారీ పేలుడు సంభవించింది. ఆ ఇల్లు ఆసిఫ్ షేక్ అనే ఉగ్రవాదిదని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 22న పహల్గాంలో మారణకాండ సృష్టించిన ఉగ్రవాదు ల్లో ఆసిఫ్ హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులోనూ పోలీసులు అతడి పేరును చేర్చారు. ఇటు క్షిపణుల ప్రయోగం తో పరిస్థితి మరింత టెన్షన్ గా మారుతోంది. వాయుసేన అప్రమత్తం అవుతోంది. సరిహద్దులో పెరుగుతున్న బలగాల తో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ పుహల్గాం దాడి వెనుక ఉన్నవారిని వదిలేది లేదని తేల్చి చెప్పారు.
VIDEO | House of terrorist Asif Sheikh, who was allegedly involved in Pahalgam terror attack, was blown up in Jammu and Kashmir's Tral. More details awaited.
— Press Trust of India (@PTI_News) April 25, 2025
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/KQLGoPRpgf
రంగంలోని ఆర్మీ చీఫ్
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారానికి భారత ఆర్మీ సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా శుక్రవారం జమ్ము కశ్మీర్ లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పర్యటించనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి దాడి నేపథ్యంలో జమ్ముకాశ్మీర్ లోభద్రతా పరిస్థితిని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సమీక్షించ నున్నారు. శ్రీనగర్‌లో భద్రతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ఉగ్ర దాడి జరిగిన బైసరన్ వ్యాలీని సైతం ఆయన సందర్శించనున్నారు. కాశ్మీర్ లోయలో నియంత్రణ రేఖ వెంబడి సైన్యం తీసుకున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యల గురించి స్థానిక సైనిక విభాగాల అగ్ర కమాండర్లు ఆర్మీ చీఫ్ కి వివరించనున్నారు. ఇటు.. త్రివిధ దళాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దీంతో.. ఏ క్షణాన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications