భార్యను కొడవలితో నరికి స్పాట్ లో చంపి విషం తాగేశాడు. కూతర్లకు పెళ్లి చేసి !
బెంగళూరు/సర్జాపుర్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు పుట్టిన తరువాత కుమారులు వద్దులే అనుకున్న దంపతులు వారిని పోషించి పెద్ద చేశారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేశారు. ఇంట్లో దంపతులు మాత్రమే నివాసం ఉంటున్నారు. ఓ విషయంలో గొడవపడి భార్యను దారుణంగా చంపేసిన భర్త తరువాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
బెంగళూరు నగరంలోని సర్జాపుర సమీపంలోని చిక్కనహళ్లిలోని జనతాకాలనీలో వెంకటస్వామి (54) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 25 ఏళ్ల క్రితం లక్ష్మమ్మ అలియాస్ లక్ష్మీ (48) అనే మహిళను వెంకటస్వామి వివాహం చేసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన వివాహం కావడంతో వెంకటస్వామి, లక్ష్మీ దంపతుల ఇంటికి ఇరువైపుల కుటుంబ సభ్యులు వచ్చి వెలుతున్నారు.

వెంకటస్వామి, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారసుడి కోసం ఓ కుమారుడికి జన్మనివ్వాలని కుటుంబ సభ్యులు, బంధువులు వెంకటస్వామి, లక్ష్మీ దంపతుల మీద ఒత్తిడి చేశారు. అయితే మూడోసారి కూడా కుమార్తె పుడితే లేనిపోని కష్టాలు వస్తాయని అనుకున్న వెంకటస్వామి ఇద్దరు కుమార్తెలతోనే సరిపెట్టుకున్నాడు.
కుమార్తెలను పెంచిపెద్ద చేసిన వెంకటస్వామి వారికి వివాహాలు చేశారు. ఇద్దరు కుమార్తెలు వివాహాలు చేసుకుని వారివారి భర్తలతో కలిసి వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వెంకటస్వామి, లక్ష్మీ దంపతులు వారి సొంత ఇంటిలో నివాసం ఉంటూ కొంతకాలం క్రితం వరకు చాలా సంతోషంగా జీవించారని స్థానికులు అంటున్నారు.
అయితే ఇటీవల ఓ విషయంలో వెంకటస్వామి, లక్ష్మీ దంపతుల మధ్య తేడాలు వచ్చాయి. ఇదే విషయంలో దంపతులు గొడవపడుతూ ఉన్నారు. బంధువులు. చుట్టుపక్కల వాళ్లు సర్దిచెబుతున్నా దంపతులు మాత్రం గొడవలు పడుతూనే ఉన్నారు. రాత్రి వెంకటస్వామి ఇంటికి వెళ్లాడు. తరువాత ఏం జరిగిందో తెలీదుకాని ఇద్దరూ గొడవపడ్డారు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన వెంకటస్వామి కొడవలి తీసుకుని అతని భార్య లక్ష్మీని దారుణంగా నరికి స్పాట్ లో చంపేశాడు.

భార్య లక్ష్మీని హత్య చేసిన తరువాత వెంకటస్వామి ఇంట్లోనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుదవారం ఎంతసేపటికి వెంకటస్వామి, లక్ష్మీ దంపతులకు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చి వెళ్లి చూడగా ఈ దారుణం వెలుగు చూసింది. భార్య లక్ష్మీని హత్య చేసి వెంకటస్వామి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని కచ్చితంగా తెలీదని, కేసు విచారణలో ఉందని సర్జాపుర పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications