Wife: రాత్రి ఒంటరిగా వెలుతున్న భార్య, నడిరోడ్డులో పొడిచిపొడిచి చంపేసిన భర్త, ఆ ఊరిలో ఏంపని ?
ఒకే ఇంటిలో ఉంటున్న దంపతుల మద్య మాటలు లేవు. ఉదయం బయటకు వెళ్లిన భార్య రాత్రి మళ్లీ ఇంటికి బయలుదేరింది. మార్గం మద్యలో రద్దీగా ఉండే రోడ్డులో భార్యను అడ్డగించిన భర్త అందరూ చూస్తుండగానే అతని భార్యను దారుణంగా పొడిచి చంపేయడం కలక
చెన్నై/వేలూరు/చిత్తూరు: కొన్ని సంవత్సరాల తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. దంపతులకు వాళ్ల పెద్దలు బుద్దిమాటలు చెబుతూ వచ్చారు. పెద్దలు పంచాయితీలు చేసిన కొన్ని రోజులు దంపతులు బాగానే ఉండేవారు. తరువాత దంపతులు మళ్లీ మొదటికి వస్తున్నారు. ప్రతిరోజు గొడవలు పడుతున్న దంపతులు ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఒకే ఇంటిలో ఉంటున్న దంపతులు మాత్రం ఎవరిదారిలో వాళ్లు వెలుతున్నారు. ఇద్దరి మద్య మాటలు లేవని తెలిసింది. ఉదయం బయటకు వెళ్లిన భార్య రాత్రి మళ్లీ ఇంటికి బయలుదేరింది. మార్గం మద్యలో రద్దీగా ఉండే రోడ్డులో భార్యను అడ్డగించిన భర్త అందరూ చూస్తుండగానే అతని భార్యను దారుణంగా పొడిచి చంపేయడం కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
తమిళనాడులోని వేలూరు (ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా సరిహద్దు)లో పట్టణంలో జైశంకర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన పునీత అలియాస్ పునీ అనే యువతిని జైశంకర్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొన్ని సంవత్సరాల వరకు జైశంకర్, పునీత దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

దంపతుల మధ్య గొడవలు
భార్య పునీత మీద ఆమె భర్త జైశంకర్ కు అనుమానం మొదలైయ్యింది. పునీత వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త జైశంకర్ కు విపరీతమైన అనుమానం వచ్చింది. కొన్ని సంవత్సరాల తరువాత జైశంకర్, పునీత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పునీత, జైశంకర్ దంపతులకు వాళ్ల పెద్దలు బుద్దిమాటలు చెబుతూ వచ్చారు. పెద్దలు పంచాయితీలు చేసిన కొన్ని రోజుల వరకు జైశంకర్, పునీత దంపతులు బాగానే ఉండేవారు.

భార్య తీరు మార్చుకోలేదని ?
రాజీలు చేసిన కొన్ని రోజుల తరువాత జైశంకర్, పునీత దంపతులు మళ్లీ మొదటికి వస్తున్నారు. ప్రతిరోజు గొడవలు పడుతున్న పునీత, జైశంకర్ దంపతులు ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఒకే ఇంటిలో ఉంటున్న జైశంకర్, పునీత దంపతులు మాత్రం ఎవరిదారిలో వాళ్లు వెలుతున్నారు. ఇద్దరి మద్య చాలాకాలం నుంచి మాటలు లేవని తెలిసింది. రోజు బయటకు వెలుతున్న భార్య పునీత ఎక్కడికి వెలుతుందో, ఏం చేస్తుందో అని ఆమె భర్త జైశంకర్ ఆరా తీశాడు.

భార్యను నడిరోడ్డులో అడ్డగించిన భర్త
పునీత ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. వేలూరు నుంచి చిత్తూరు వెళ్లిన పునీత రాత్రి మళ్లీ వేలూరుకు చేరుకుంది. భార్య పునీత మీద ఆమె భర్త జైశంకర్ చాలా కాలం నుంచి నిఘా వెయ్యడంతో ఆరోజు పునీత చిత్తూరు వెళ్లి మళ్లీ వేలూరుకు వచ్చిందని తెలుసుకున్నాడు. పునీత నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో జైశంకర్ అతని భార్య పునీతను అడ్డుకున్నాడు. పునీత వ్యానిటీ బ్యాగ్ లాక్కొవాలని జైశంకర్ ప్రయత్నించాడు. అయితే పునీత ఎదురుతిరగడంతో ఆమె భర్త జైశంకర్ రగిలిపోయాడు.

భార్యను దారుణంగా పొడిచి చంపేసిన భార్య
రద్దీగా ఉండే రోడ్డులో జైశంకర్ అతని భార్య పునీతతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో రగిలిపోయిన జైశంకర్ అతని భార్యను అటూ ఇటూ తిప్పుతు కత్తితో పొడిచాడు. తప్పించుకోవడానికి పునీత ప్రయత్నించింది. అయితే జైశంకర్ మాత్రం ఆమెను వదలకుండా కత్తితో పొడుస్తూనే ఉన్నాడు. అటువైపు వెలుతున్న వారు జైశంకర్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. చివరికి పునీత వ్యానిటీ బ్యాగ్ రోడ్డు మీద పడేసింది. అయితే జైశంకర్ మాత్రం అతని భార్య పునీతను వదలకుండా కత్తితో పొడవడంతో ఆమె కుప్పకూలిపోయింది. జైశంకర్ అక్కడి నుంచి పరారైనాడు.

సీసీటీవీ కెమెరాల్లో ?
తీవ్రగాయాలైన పునీతను వేలూరులోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై పునీత చనిపోయిందని పోలీసులు అన్నారు. నడిరోడ్డులో భార్య పునీతను దారుణంగా హత్య చేసిన జైశంకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. జైశంకర్ అతని భార్య పునీతను హత్య చేసే సమయంలో సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ క్లిప్పింగ్స్ బయటకు రావడంతో వైరల్ అయ్యాయి.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications