చిలిపిగా, తియ్యగా ముద్దు పెట్టుకునే భార్య బుగ్గలను ఆసుపత్రిలో బ్లేడ్ తో కోసేసిన భర్త
సాధారణంగా పెళ్లయిన కొత్త జంట ఒకరికి ఒకరు తియ్యగా, చిలిపిగా బుగ్గలపై ముద్దు పెట్టుకోవడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ శాడిస్టు భర్త బ్లేడుతో అతని భార్య చెంప బుగ్గలను కోసేశాడు.ఈ సంఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా సకలేషపుర పట్టణంలోని అగ్రహార బరంజీలో జరిగింది. భర్త చేతిలో దాడికి గురైన భార్య అనూషా అని, భార్యను విచక్షణా రహితంగా కొట్టిన భర్త పేరు శరత్ అని పోలీసు అధికారులు తెలిపారు.
చిన్న కారణానికి భార్యాభర్తలు అనూషా, శరత్ ల మధ్య గొడవ జరగడంతో శరత్ అతని భార్యపై దారుణంగా దాడి చేశాడు. భర్త శరత్ దాడి చేయడంతో అతని భార్య అనూషా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరింది.అయితే తనపై జరిగిన హింసపై తన భార్య అనూషా పోలీసులకు ఫిర్యాదు చేస్తుందేమోనన్న భయంతో శరత్ రగిలిపోయాడు. భార్య అనూషాను చేర్పించిన ఆస్పత్రిలోకి చొరబడిన శరత్ ఆమెను హత్య చెయ్యడానికి యత్నించాడు.

ఆయుధాలను ఆస్పత్రికి తీసుకెళ్లడం కుదరదు అని తెలుసుకున్న నిందితుడు శరత్ ఆస్పత్రికి వెళ్లి అక్కడ శాస్త్ర చికిత్స కోసం ఉపయోగించే పదునైన బ్లేడు తీసుకుని అతని భార్య అనూషా చెంపలు, చేతులను ఇష్టం వచ్చినట్లు కోసేశాడు. భార్య అనూషాపై దారుణంగా దాడి చేసిన శరత్ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు.ఘటన అనంతరం ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి అనూషా నుంచి వివరాలు సేకరించారు. నిందితుడు శరత్ పై కేసు నమోదు చేసిన పోలీసులు భార్య అనూషాపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించిన శరత్ కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా అనూషాపై మరోసారి దాడికి పాల్పడే అవకాశం లేకుండా పోలీసులు ఆసుపత్రిలో కాపలా కాస్తున్నారు. ఈ ఘటన సకలేశపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగగా నిందితుడు శరత్ కోసం పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications