మరిదితో అక్రమ సంబంధం, ఏటీఎం కేంద్రంలో భార్యను కాల్చి చంపేసిన భర్త, రివాల్వర్ తో తమ్ముడిని!
అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గర్భవతి అయిన భార్యను ఓ భర్త కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో కలకలం రేపింది. మరిదితో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో భర్త ఈ చర్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. షహరాన్‌పూర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం కేంద్రంలోనే భార్యను రివాల్వర్ తో కాల్చి చంపేసిన భర్త అతని తమ్ముడిని రివాల్వర్ తో కాల్చేశాడు.
హత్యకు గురైన మహిళ గర్భిణి అని పోలీసులు అన్నారు. నిందితుడి అతని తమ్ముడిని హత్య చెయ్యడానికి ప్రయత్నించడంతో అతనికి బుల్లెట్ గాయాలైనాయని పోలీసులు తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో భార్యను కాల్చిచంపిన భర్త ఆ తర్వాత నేరుగా ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న సోదరుడిపై కాల్పులు జరిపాడు. మహిళ గర్భవతి కావడంతో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని, భార్య కడుపులో ఉన్న బిడ్డ తన తమ్ముడి సంతానం అని ఆమె భర్త అనుమానించాడు.

ఈ ఘటన ఉదయం 8.30 నుంచి 9 గంటల మధ్య జరిగిందని పోలీసులు తెలిపారు. షహరాన్‌పూర్‌లోని మండి ఠానా వద్ద హెచ్‌డీఎఫ్‌సీ ఎటీఎంలోకి చొరబడిన భర్త అక్కడ డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్లిన అతని భార్యపై పలుసార్లు కాల్పులు జరిపాడు. భర్త చేతిలో హత్యకు గురైన భార్య ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ ఏటీఎంలో రక్తపు మడుగులో పడి చనిపోయింది. మృతి చెందిన మహిళను అలియాగా గుర్తించామని పోలీసులు తెలిపారు.
ఆలియాను ఆమె భర్త జిషాన్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. తన భార్య ఆలియా తన తమ్ముడితో (మహిళకు మరిది వరుస అవుతాడు) అక్రమ సంబంధం పెట్టుకుందని, తన తమ్ముడి కారణంగా తన భార్య గర్భవతి అయ్యిందని భర్త జిషాన్ అనుమానించాడు. తర్వాత భార్య ఆలియా, ఆమె మరిది మధ్య ఎఫైర్ ఉందని కచ్చితంగా తెలుసుకున్న జిషాన్ ఇద్దరిని చంపేయాలని స్కెచ్ వేశాడు. ఇదే విషయంలో జీషాన్ కోపంతో రగిలిపోయి ఆమె మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో భార్యపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

భార్య ఆలియా మీద కాల్పులు జరిపిన తరువాత జిషాన్ అతని ఇంటికి వెళ్లి సోదరుడిపై కూడా కాల్పులు జరిపాడు. సోదరుడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హెచ్ డీఎఫ్ సీ ఏటీఎం కేంద్రంలో ఉన్న ఆలియా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఏటీఎంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
ఘటన అనంతరం నిందితుడు జిషాన్ తప్పించుకోగా అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం రాజస్థాన్‌లో తన భర్తకు దూరంగా ఉంటున్న సోషల్ మీడియా స్టార్ ను ఆమె భర్త ఇలాగే కాల్చి చంపాడు. ఈ దృశ్యం సీసీటీవీలో రికార్డవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మరువకముందే ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications