Heat Wave: దేశంలో రానున్న మూడు రోజులు వడగాలులు.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక..

దేశంలో వడ గాలులు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్‌తో సహా దేశంలోని కొన్ని ప్రాంతాలలో రాబోయే మూడు, నాలుగు రోజుల్లో వేడిగాలులు(Heat wave) వీచే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం ఏప్రిల్ 17 వరకు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, ఒడిశాలో ఏప్రిల్ 15 వరకు, బీహార్ ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 17 వరకు వడ గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలు వడగాలులతో ఇబ్బంది పడుతున్నాయి. ఒడిశాలో గురువారం రోజు ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ నెలలో అత్యధికం. బరిపడలో 43.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదైందని IMD సీనియర్ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలిపారు. ఏప్రిల్ 14, 15 తేదీలలో ఒడిశాలో వడగాలుల హెచ్చరిక జారీ చేశారు. ఈ వాతావరణ పరిస్థితులు రాబోయే 3 రోజులు కొనసాగవచ్చని అంచనా వేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.

 heat wave

జార్ఖండ్‌లోని ప్రధాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటడంతో వడ గాలులు పెరిగాయి. ఏప్రిల్ 13న రాష్ట్రంలో అత్యధికంగా జంషెడ్‌పూర్ లోని దాల్తోన్‌గంజ్‌లో 41.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాంచీలో సాధారణం కంటే 2.3 డిగ్రీలు అధికంగా 38.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాబోయే 48 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత ప్రస్తుత ఉష్ణోగ్రత కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చు.

 heat wave

ఏప్రిల్ 20 వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రత 37 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా, పురూలియా, పశ్చిమ్ మెదినీపూర్, పశ్చిమ్ బర్ధమాన్, బీర్భూమ్ జిల్లాలు వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్రమైన వేడి కారణంగా పశ్చిమ బెంగాల్‌లో వేసవి సెలవులను రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+